టీఎన్జీవోస్‌ జిల్లా కార్యలయంలో జెండా ఆవిష్కరణ

కరీంనగర్‌:(టౌన్‌) టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఎ హమీద్‌ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా కార్యలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించరు. ఈ సంధర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగస్తులు విధి నిర్వహణలో బాధ్యయుతంగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఈ సంధర్భంగా విధినిర్వహణలో జిల్లా అధికారులచేత ప్రశంస పత్రాలు పొందిన ఉద్యోగస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలయ్యే వరకు గ్రామ గ్రామంలో ఉద్యమ స్పూర్తిని నింపాలని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగించాలని పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు జి.రామరావు, లక్ష్మన్‌రావు, రిటైడ్‌ ఉద్యోగ సంఘం నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు.