టెహ్రన్‌లో అనారోగ్యంతో మెట్‌పల్లి వాసి మృతి

మెట్‌పల్లి: ఉపాధి కోసం టెహ్రన్‌వెల్లిన మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన మంతెన చిన గంగారాం(53) అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గత 25సంవత్సరాలుగా టెహ్రన్‌లో ఉంటున్న గంగారం 6నెలల క్రితం ఇంటికి వచ్చి కూతురు పెళ్లి చేసి తిరిగి టెహ్రన్‌ వెళ్లాడు. 20రోజుల క్రితం గంగారం అనారోగ్యానికి గురి కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 15న మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడి మిత్రులు కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.