ట్రాక్టర్‌ను రైలింజన్‌ డీ : ఇద్దరికి గాయాలు

విజయవాడ, ఆగస్టు 2: నెల్లూరు జిల్లా కావలి వద్ద ఒక ట్రాక్టర్‌ను రైలింజన్‌ డీ కొన్న సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఫలితంగా విజయవాడ – చెన్నై మధ్య రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. విజయవాడకు అందిన సమాచారం మేరకు కావలి మండలం ముసునూరు వద్ద రైల్వే గేటు తెరిచి వుండగా పట్టాలు దాటుతున్న ఒక ట్రాక్టర్‌ను ఆ మార్గంలో వెళుతున్న రైలింజన్‌ డీ కొట్టింది. దీంతో ట్రాక్టర్‌ నుజ్జునుజ్జైంది. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పట్టాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీనితో ఆ మార్గంలో రైళ్ళను ఎక్కడిక్కడ నిలిపివేశారు. మరమ్మత్తు పనులు, యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అయినప్పటికి రైళ్ళ పునరుద్ధరణకు మూడు, నాలుగు గంటల సమయం పట్టవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. అవసరాన్ని బట్టి రైళ్ళను సింగిల్‌ లైన్‌ పై నడుపుతామని రైల్వే అధికారులు సూచించారు.