స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూదార్ కార్డులు
` తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
` భూ భారతిని సమగ్రంగా తయారు చేశాం
` ప్రజలు మెచ్చే విధంగా చట్టం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్(జనంసాక్షి):భూదార్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ భారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూ భారతిని సమగ్రంగా తయారు చేశామన్నారు. 9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపర మైనవి పరిష్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలోని ఉన్న అనేక సీక్రెట్ లాకర్లు ఓపెన్ చేశామని తెలిపారు. భూభారతిలో చెప్పిన విధంగా భూధార్ కార్డులు సిద్ధం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వాటిని పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విూడియాతో మాట్లాడి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిరచారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు. రెండో విడతలో 373 నక్షలేని గ్రామాల్లో సర్వే చేస్తామని..ఎన్నికల తర్వాత భూదార్ కార్డులు అందజేస్తామని తెలిపారు. రెండేళ్ల ప్రజా పాలనలో కేసీఆర్ హయాంలో తీసుకువచ్చిన ధరణిని బంగాళాఖాతంలో వేశామని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్లు ఓపెన్ చేశామన్నారు. భూభారతిలో చెప్పిన విధంగా భూధార్ కార్డులు సిద్ధంగా ఉన్నాయన్నారు. భూభారతి చట్టంతో రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు. ధరణిని బీఆర్‌ఎస్ సర్కార్ విదేశీ సంస్థకు అప్పగించిందని చెప్పారు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక భూ భారతిని కేంద్ర సంస్థకు అప్పగించామన్నారు. భయంకరమైన ధరణి వెబ్ సైట్ ను బంగాళాఖాతంలో పడేశామన్నారు. స్థానిక ఎన్నికల తర్వాత నక్షల్లేని గ్రామాల్లో సర్వేలు చేసి భూధార్ కార్డులిస్తామని తెలిపారు. ధరణి వెబ్ సైట్ తో బీఆర్‌ఎస్ రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చిందన్నారు.ప్రజలు మెచ్చే భూ భారతి చట్టాన్నితమ ప్రభుత్వంలో తీసుకువచ్చామని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నక్షలేని 5గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామని వివరించారు. ఇవాళ(బుధవారం) తెలంగాణ సచివాలయంలో విూడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడారు. 6వేల మంది వీఆర్‌ఏలను నియమించామని తెలిపారు. 490మంది సర్వేయర్లకు లైసెన్స్‌లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఒక్కో రెవెన్యూ గ్రామానికి సర్వేయర్లను అలాట్ చేశామని తెలిపారు. రోవర్స్ కొనుగోలు చేసి సర్వేయర్లకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా కుప్ప కూల్చారని..తమ ప్రభుత్వం సరిచేస్తున్నామని వివరించారు. 59 సబ్ రిజిస్టార్ర్ ఆఫీసులను అధునాతనంగా నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.



