నిఖత్ జరీన్‌కు స్వర్ణం
` వరల్డ్ బాక్సింగ్ కప్‌లో గోల్డ్ మెడల్ కైవసం
` ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై గెలుపు
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత బాక్సింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ కప్‌లో స్వర్ణ పతకం (51 కిలోల విభాగంలో) కైవసం చేసుకుంది.ఇవాళ (నవంబర్ 20) జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై 5-0తో గెలుపొందింది. నిఖత్ సాధించిన ఈ పతకంతో ప్రస్తుత బాక్సింగ్ కప్‌లో భారత మహిళలు సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది. నిఖత్‌కు ముందు 48 కిలోల విభాగంలో మినాక్షి హూడా, 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్, 70 కిలోల విభాగంలో అరుంధతి, 80ం కిలోల విభాగంలో నూపుర్ శెఓరన్ స్వర్ణాలు సాధించారు. మాజీ ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్.. దాదాపు రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ పతకాన్ని సాధించింది. ఈ టోర్నీలో నిఖత్ వెయిట్ కేటగిరీలో ఐదుగురు బాక్సర్లు మాత్రమే బరిలోకి దిగారు. దీంతో నేరుగా సెమీఫైనల్ ఆడిన నిఖత్ 5-0తో జెనీవా గుల్‌సెవర్ (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది.భుజం గాయంతో దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన నిఖత్ ఈ టోర్నీతోనే బరిలోకి దిగింది. 2024 ఫిబ్రవరిలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో సాధించిన విజయం తర్వాత నిఖత్ గెలిచిన తొలి పతకం ఇదే.

