27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
` జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి
` నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్‌(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి అయింది. జీహెచ్‌ఎంసీ విస్తరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చింది. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్‌ జారీ చేసింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డుల స్వాధీనానికి ఉత్తర్వులు జారీ చేసింది. రికార్డులు స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లకు అప్పగించింది.