అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

నడికూడ, డిసెంబర్ 5 (జనం సాక్షి):

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున పరకాల నియోజకవర్గం నడికుడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎరుకల అంజిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలు తీర్చే లేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాగానే నిరుపేదలకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్తు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, మహిళలకు వడ్డీ లేని రుణాలు రైతులకు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ అందించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు ఈ కార్యక్రమంలో నడికుడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.