బస్వాపూర్ సర్పంచ్ గా నజ్మా సుల్తానా

 

 

 

 

 

 

 

వెల్దుర్తి, డిసెంబర్ 7 (జనం సాక్షి )వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామ సర్పంచ్ గా నజ్మా సుల్తానా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వెల్దుర్తి మండలం బస్వాపురం గ్రామపంచాయతీ అభ్యర్థిగా కార్వాన్ ఎమ్మెల్యే సతీమణి నజ్మా సుల్తానా ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దాంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు. గతంలో కూడా ఆమె జిహెచ్ఎంసి పరిధిలోని నానక్ నగర్ మరియు గోల్కొండ కార్పొరేటర్ గా కూడా ప్రజలకు సేవలు అందించారు. బస్వాపురం సర్పంచ్ గా నజ్మా సుల్తానా ఏకగ్రీవం ఎన్నిక కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.