ఎన్నికలను బహిష్కరించిన ఎర్రవల్లి గ్రామస్థులు

 

 

 

 

 

డిసెంబర్ 5 (జనం సాక్షి) :నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లిలో స్థానికులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. నార్లాపూర్‌-డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గోకారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్‌ కోసం విడుదల చేసిన ఆర్‌అండ్‌ఆర్‌ జీవోను రద్దు చేయాలని కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సర్పంచ్‌ ఎన్నికలను బహిష్కరించారు. పంచాయతీని ఎస్టీ జనరల్‌కు కేటాయించగా.. మూడో విడుత ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదు.