’తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు రండి..
` ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
` రాజ్‌నాథ్ సహా పలువురు కేంద్రమంత్రులకూ..
` తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి
` భట్టితో కలసి ఆహ్వానించిన ముఖ్యమంత్రి
` పార్టీలో అంతర్గతంగా మాట్లాడితే ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే ’తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్దికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్`బెంగళూరు`చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు. పలువురు కేంద్ర మంత్రులతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను కలిసిన సీఎం సమ్మిట్‌కు ఆహ్వానించారు. కాగా, మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను సీఎం రేవంత్‌రెడ్డి కలిసి గ్లోబల్ సమిట్‌కు రావాలని కోరారు. తరవాత సిఎం రేవంత్ విూడియాతో చిట్‌చాట్‌లో ..తెలంగాణలో పదేళ్లు తన నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హిందూ సమాజంలాంటిదే కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పానని సిఎం వివరించారు. పార్టీ నేతగా ఎలా పనిచేయాలనేది వివరించే క్రమంలో చెప్పానన్నారు. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కోల్పోవడంతో భాజపా దీన్ని వివాదం చేస్తోందని మండిపడ్డారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఉత్తర భారతంలోనూ తనను పాపులర్ చేస్తున్నందుకు సంతోషమని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో ముందు వెనక కట్ చేసి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు తెలంగాణలో తన నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ అని కొత్తగా ఎన్నికైన తమ పార్టీ జిల్లా అధ్యక్షులకు చెప్పినట్లు వివరించారు. సమావేశంలో పార్టీ నాయకుడిగా ఎలా పనిచేయాలో తాను చెప్పినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడంతో ఈ విషయాన్ని పెద్దదిగా చేసి వివాదాస్పదం చేస్తోందని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లు మూడు కోట్ల మంది ఉన్నారని? పలు సారూప్యతలు కలిగిన దేవుళ్లు ఉన్నారని తాను చెప్పానని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా హిందూ సమాజం లాంటిదేనని అని పోలుస్తూ తాను వ్యాఖ్యానించానని స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పలు కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారంపిసిసి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడిన మాటలను కొంతమంది సోషల్ విూడియాలో వక్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీని కోరాను.. విూరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకరించారని తెలిపాం.. అలాగే, రాష్టాన్రికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీకి పలు వినతులు చేశాం.. ఆర్‌ఆర్‌ఆర్ సౌత్ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఇక, డిసెంబర్ 8, 9న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. అలాగే, భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించిన ఆహ్వాన పత్రికను వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.
పార్టీలో అంతర్గతంగా మాట్లాడితే ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు:సీఎం రేవంత్
:తెలంగాణలో పదేళ్లు తన నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దిల్లీలో ప్రధానితోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. హిందూ సమాజంలాంటిదే కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పానని వివరించారు. పార్టీ నేతగా ఎలా పనిచేయాలనేది వివరించే క్రమంలో చెప్పానన్నారు. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కోల్పోవడంతో భాజపా దీన్ని వివాదం చేస్తోందని మండిపడ్డారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఉత్తర భారతంలోనూ తనను పాపులర్ చేస్తున్నందుకు సంతోషమని వ్యాఖ్యానించారు.



