ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ’..ఐఎంఎఫ్‌ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!

అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపినాథ్ దిగ్గజాల సరసన చేరారు. గ‌తేడాది వరకు ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా ప‌నిచేసిన గీతా గోపినాథ్.. ఈఏడాది జెఫ్రీ ఒక‌మోటో స్థానంలో ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ బాధ్య‌త‌లు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

ఐఎంఎఫ్‌ ఇప్పటి వరకు చీఫ్‌ ఎకనమిస్ట్‌గా పనిచేసిన ఫోటోల్ని గీతా గోపినాథ్‌ షేర్‌ చేశారు. ఇందులో ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏముందంటారా? ఆ జాబితాలో ఉన్న వారిలో ఏకైక మహిళగా ఆమె రికార్డ్‌ సృష్టించారు. ఆ ఫోటోల్ని ట్వీట్‌ చేసిన గీతా గోపినాథ్‌..’ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ..ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్తలుగా పనిచేసిన వ్యక్తుల సరసన నా ఫోటో ఉందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మూడేళ్ల పాటు 
ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న గీతా గోపినాథ్‌ మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆ తర్వాత హార్వ‌ర్డ్ వ‌ర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు చేపట్టాలని అనుకున్నట్లు గీతా గోపినాథ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.