ట్రైనింగ్ కి సీఆర్పీఎఫ్ జవాన్ ను సాగనంపిన కుటుంబీకులు, స్నేహితులు
ట్రైనింగ్ కి సీఆర్పీఎఫ్ జవాన్ ను సాగనంపిన కుటుంబీకులు, స్నేహితులు
మహబూబాబాద్ బ్యురో-సెప్టెంబర్28(జనంసాక్షి)
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ముల్కనూరు గ్రామానికి చెందిన బల్లెం నవీన్ కుమార్ అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని చిన్నతనంనుండే దేశానికి సేవ చేయాలన్న గొప్ప సంకల్పంతో చేసిన కృషి ఫలించింది. తన పెద్దన్నాన్న కొడుకు నరేంద్ర కుమార్ సీఆర్పీఎఫ్ జవాన్ గా అందిస్తున్న సేవలు చూసి నవీన్ ఆశ మరింత రెట్టింపు అయింది. ఉద్యోగమే లక్ష్యంగా పేదింటి నవీన్ పడ్డ కష్టం వృధాగా పోలేదు సీఆర్పీఎఫ్ జవాన్ గా చివరికి ఉద్యోగం సాధించి ట్రైనింగ్ కోసం వెళ్తున్న నవీన్ ను సాగనంపేందుకు వచ్చిన కుటుంబీకులు, స్నేహితులు, గ్రామస్థులతో గార్ల రైల్వే స్టేషన్ నిండిపోవడం విశేషం. స్టేషన్ కి వచ్చిన బంధు మిత్రులు కేక్ కట్ చేసి నవీన్ కు శుభాకాంక్షలు తెలిపి జాగ్రత్తలు చెప్పి వృత్తిలో ఉన్నత స్థాయి కి చేరుకోవాలని కోరారు. కుటుంబీకులు తల్లి వెంకటమ్మా, తండ్రి వెంకట్రాములు, అక్కలు చంద్రకళ, స్వర్ణలత, బేబీ, పెద్దమ్మ పెద్దన్నాన్నలు చంద్రయ్య జయమ్మ, అన్నలు నరేంద్ర, దుర్గ ప్రసాద్ ,స్నేహితులు ఉన్నారు.