డిఎంహెచ్‌ఓ ఎదుట ఆశావర్కర్ల ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : ఆశావర్కర్లకు జూలై నుంచి చెల్లించాల్సిన పారితోషికాలు టిఎ డిఎలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు జిల్లా సమితి శుక్రవారం డిఎంహెచ్‌ఓ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు, ఆశావర్కర్ల జిల్లా కార్యదర్శి విజయలక్ష్మిలు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 1800 మంది ఆశావర్కర్లుగా పనిచేస్తున్నారని, గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం పారితోషికాలు అందించడంలో తీవ్ర జాప్యం చేస్తుందని ఆరోపించారు. పని తగ్గ పారితోషికాలు ఇవ్వాలని బ్యాంకు అకౌంట్ల ద్వారా పారితోషికాలు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హర్షవర్దన్‌కు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.