డిపివో యాదయ్య ఆకస్మిక తనిఖీ
ఫోటోరైటప్:తనిఖీ చేస్తున్న డిపివో యాదయ్య*
పెన్ పహాడ్ మార్చి 10 (జనం సాక్షి) : మండల పరిధిలోని చిన్న గ్యార కుంట తండా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా పంచాయితీ అధికారి యాదయ్య శుక్రవారం అక్ష్మికంగా తనిఖీ నిరహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని నర్సరిని, వైకుంటా దామాన్ని సందర్శించారు అనంతరం గ్రామ పంచాయితీ రికార్డులును పరిశీలించారు. అయన మాట్లాడుతూ శానిటేషన్ పనులను సక్రమంగా నిర్వహించాలని చెత్త సేకరణ చెయ్యాలని ప్రతి శుక్రవారం మొక్కలకు నీటిని అందించి వాటిని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దారవాత్ శాలిబాయ్, ఇంచార్జి ఎంపీవో చెరుకుపల్లి జానయ్య, పంచాయితీ కార్యదర్శి సతీష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…