డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్,ఆగస్ట్4(జనం సాక్షి ): నగరంలోని బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్ద డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎల్‌ఎస్‌డీ 7 స్టిప్ర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న మల్కాజ్‌గిరికి చెందిన అక్షయ్‌కుమార్, మేడ్చల్‌కు చెందిన దాసరి రాకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



