డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్రేజీ స్టెప్పులతో సెలబ్రేట్‌ చేసుకున్న మహ్మద్‌ సిరాజ్‌


లండన్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): లార్డ్స్‌ టెస్టులో దక్కిన ఘన విజయాన్ని భారత జట్టు ఓ రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు తీసి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, ఆ సంతోషాన్ని డ్రెస్సింగ్‌ రూమ్‌లో స్టెప్పులు వేసి సెలబ్రేట్‌ చేసుకున్నాడు… సిరాజ్‌ ఎప్పుడు వికెట్‌ తీసినా, తనతో కలిసి సెలబ్రేట్‌ చేసుకునే క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి స్టెప్పులు వేశాడు.