ఢిల్లీలో గవర్నర్‌ నరసింహన్‌ బిజీబిజీ

న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాను  కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ఇంకా ఆయన కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంతో సమావేశం కానున్నారు. అవసరమైతే ఆయన రెండుమూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులు, ఇతర నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.