ఢిల్లీలో సమైక్యవాణి వినిపిస్తాం : శైలజానాధ్‌

హైదరాబాద్‌: మంత్రి గంటా శ్రీనివాస్‌ ఇంట్లో జరిగిన సీమాంధ్ర నేతల సమావేశం అనంతరం మంత్రి శైలజానాధ్‌ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అక్కడికి వెళ్లి కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేను కలువనున్నట్లు తెలిపారు. అయనతో పాటు పార్టీలో ముఖ్యులు, పెద్దలను కలుస్తామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజాస్వామ్యయుతంగా  మాట్లాడుకునే హక్కు తమకు ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి సమైక్యవాణిని వినిపిస్తామని చెప్పారు. సమైక్యరాష్ట్రం కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నిస్తామని ఆయన తెలియజేశారు.