ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ నివాసం వద్ద ఉద్రిక్త
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 1984 అల్లర్ల బాధితులు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాసాన్ని ముట్టడించారు. తమకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. సీఎం షీలాదీక్షిత్ నివాసం వద్ద భారీగా పోలీసులను భారీగా మోహరించారు.