తమ్మినేని కి ఘన స్వాగతం పలికిన: సిపిఎం పార్టీ

 మండల కమిటీ.తమ్మినేని కి ఘన స్వాగతం పలికిన: సిపిఎం పార్టీ మండల కమిటీ.
బూర్గంపహాడ్ మార్చి 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక సెంటర్లో సిపిఐ ఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కు సిపిఎం పార్టీ మండల కమిటీ ఘనంగా స్వాగతం పలికారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర ఈనెల 17న హనుమకొండలో ప్రారంభమై మంగళవారం ఉదయం 10 గంటలకు బూర్గంపహాడ్ మండలంలోకి జన చైతన్య యాత్ర మోటార్ సైకిల్ ర్యాలీ వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సిపిఐ ఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కి సారపాక సెంటర్లో మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పూలదండ వేశారు, మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, కౌవులూరి నాగమణి, కమటం మరియమ్మ హారతి ఇచ్చి సిపిఎం పార్టీ మండల కమిటీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి ఎంబి నర్సారెడ్డి, భయ్యా రాము, రాయల వెంకటేశ్వర్లు, గుంటక కృష్ణ, బర్ల తిరపతయ్య, పి వేణు, పాండవుల ప్రభాకర్, పి చందర్రావు, బోళ్ల ధర్మ తదితరులు పాల్గొన్నారు.