తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు

దెందులూరు: ఎగువ నుంచి వస్తున్న వరదతో పశ్చిమగోదావరి జిల్లా నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు జలాశయం నీటిమట్టం పెరుగుతోంది.ప్రాజెక్టులో నీటిమట్టం 348 అడుగులకు చేరుకోవడంతో 4,400 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి అంతే మొత్తంలో ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. తమ్మిలేరు నుంచి విడుదలవుతున్న నీటితో ఏలూరు-శ్రీపర్ర కాజ్‌వేపై అడుగు ఎత్తున నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.