తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
చిగురుమామిడి: విద్యుత్తు కోతలకు నిరసనగా మండల సీపీఐ కార్యదర్శి స్వామి ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్ కార్యాలయాన్ని దిగ్భంధించారు. అధికారులను లోనికి వెళ్లకుండా కార్యాలయం తలుపులు మూసివేసి కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.