తహసీల్దారు బదిలీపై నాయకులు,

ఓ ఉద్యోగి కసరత్తు :-
గత ఐదు నెలల క్రిందట యర్రగొండపాలెం తహసీల్దారుగా వచ్చిన అశోక్‌వర్ధన్‌ను బదిలీ చేయించాలని, అదేశాఖలో నిచేస్తున్న ఓ ఉద్యోగి స్థానిక అధికారపార్టీ నాయకులు ఒంగోలు, హైదరాబాదు స్థాయిలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తుంది. తహసీల్దారు యర్రగొండపాలెం మండల బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి అడపాదడపా దళిత వర్గాలకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరిస్తున్నారని, ఏళ్ల తరబడి పరిష్కారం కానీ భూ తగాదాలను రహదారి వివాదాలను ఆయన స్వయంగా వెళ్లి ఎలాంటి నాయకుల ప్రమేయం లేకండా పరిష్కరించారని పలువురు అంటున్నారు. నాగయ్య భూ విషయంలో తహసీల్దారు శ్రద్ధ చూపడం ఏమిటని ఆ భూముల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు చేతుల్లో ఉందని ఆ భూమి ప్రస్తుతం కోటి రూపాయల విలువ చేస్తుందని, ఆ భూమిని తహసీల్దారు లబ్దిదారునికి అప్పచెప్పడమే ఆయన బదిలీకి కారణమైందని ప్రజలు అంటున్నారు. యర్రగొండపాలెం తహసీల్దారు కార్యాలయం హయాంలో గత 15 సంవత్సరాల క్రిందట నరసింగరావు అనే తహసీల్దారు ఆయన తరువాత అశోకవర్దన్‌లే ప్రజల సమస్యలను నాయకుల ప్రమేయం లేకుండా పరిష్కరిస్తున్నారని అలా చేయడం వలనే స్థానిక నాయకులు రెవెన్యూ సిబ్బంది జీర్ణించుకోలేక ఆయన బదిలీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనను బదిలీ చేస్తే స్థానికులు ఆందోళన చేస్తామని పలువురు అంటున్నారు.