తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి….

టేకుమట్ల.ఆగస్టు30(జన౦సాక్షి) ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం నేరెళ్ల శ్రీనివాస్ (55) అనే గీత కార్మికుడు రోజువారి లాగానే సాయంత్రం తాటి చెట్లు ఎక్కడానికి వెళ్ళాడు.తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీసే క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడి మృతి చెందాడు. మృతుడి మృతివిషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి మృతికి గల కారణాలను తోటి గీతా కార్మికుల అడిగి తెలుసుకున్నారు పైత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. నేరెళ్ల శ్రీనివాస్ మరణంతో వెలిశాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన వెంట ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి వెలిశాల సర్పంచ్ చింతలపల్లి విజయ స్వామి రావు, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.