తాసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి రైతు దీక్ష తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 10 శంకరపట్నం తాసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి కిషన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం రైతు దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టిన విధంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలి ధరణి పోర్టల్ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతులకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి పంటలను కాపాడాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణ రైతాంగం నిక్కీ అమలు చేయాలని ఉచిత ఎరువుల హామీని అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ శంకరపట్నం కిసాన్ మోర్చా అధ్యక్షుడు మందాడి జగ్గారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించి జై జవాన్… జై కిసాన్ నినాదాలు చేశారు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తాసిల్దార్ గూడూరు శ్రీనివాస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జంగం జైపాల్ మండల జనరల్ సెక్రెటరీ లు ఎలుక పెళ్లి సంపత్ దాసరపు నరేందర్ యువ మోర్చా మండలాధ్యక్షుడు బొడిగ నరేష్ ఎస్టీ మోర్చా మండలాధ్యక్షుడు బిజిలి సారయ్య కిసాన్ మోర్చా జనరల్ సెక్రెటరీ రమణారెడ్డి యువమోర్చా మండల ఉపాధ్యక్షులు నూనె కొండల్ రెడ్డి పల్లె శివారెడ్డి పల్లె కోమరెడ్డి రెమిడి రాజు రెడ్డి చిగురు శ్రీనివాస్ బీజేపీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు