తిరుపతి చేరుకున్న సీఎం, గవర్నర్‌లు

హైదరాబాద్‌: ప్రధాని, రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లు తిరుపతి చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయంలో స్థానిక నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి వారు పద్మావతి అతిధిగృహానికి చేరుకున్నారు. సాయంత్రం వీరు శ్రీహరికోటలోని షార్‌ కేంద్రానికి వెళ్లి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు స్వాగతం పలుకుతారు. రాత్రికి తిరిగి తిరుపతి విమానాశ్రయం చేరుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి స్వాగతం పలికి తిరుమలకు తీసుకుని వెళతారు.