తిరుమలలో మరోసారి చిరుత అలజడి

తిరుపతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి):   తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సవిూపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికా రులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో గుంపులుగా భక్తులను పంపుతున్నారు. మరోవైపు చిరు తను ట్రేస్‌ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు.