తిరువూరు ఎమ్మెల్యే అరెస్టుకు వారెంట్‌ జారీ

విజయవాడ, జూలై 19 : తిరువూరు ఎమ్మెల్యే పద్మజ్యోతి అరెస్టుకు న్యాయస్థానం వారెంట్‌ జారీ చేసింది. తిరువూరు కోర్టు గురువారం ఆమె అరెస్టుకు పోలీసులను ఆదేశించింది. పటమటి కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసు విచారణకు ఎమ్మెల్యే హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారంనాటి కేసు వాయిదాకు కూడా ఆమె గైర్హాజరు కావడంతో అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. తక్షణం ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సిందిగా న్యాయస్థానం తిరువూరు పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చింది.