తీవ్ర కడుపు నొప్పితో లారీ డ్రైవర్‌ మృతి

కొండపాక : తీవ్ర కడుపు నొప్పితో ఓ లారీడ్రై మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా కొండపాక మండలం దుద్దెడ జాతీయ రహదారి పై విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద చోటు చేసుకుంది. లారీ నడుపుతున్న సమయంలో కడుపు నొప్పితో కర్నూలుకు చెందిన అయ్యాలమ్‌ అనే డ్రైవర్‌ లారీ దిగి రోడ్డుకు సమీపంలో ఒక్కసారిగా కుప్ప కూలి పోయాడు. స్థానికులు సమాచారంతో 108 కి సిబ్బంది అక్కడికి చేరుకొని అతడు మృతి చెందినట్లు గుర్తించారు. లారీ హైదరాబాద్‌ నుంచి మహరాష్ట్ర చందాపూర్‌కు వెళ్లునది.