తూగో జిల్లాలో అగ్నిప్రమాదం : పది ఇళ్లు దగ్థం

తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం జీఎంపేట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. గ్రామానికి చెందిన నేమాల సత్యనారాయణ ఇంటి నుంచి ఎగిసిపడిన అగ్నికీలలు సమీప ఇళ్లను చుట్టేశాయి, దాదాపు పది ఇళ్లు ఈ ప్రమాదంలో కాలిపోతున్నాయి. గ్రామంలోని యువకులు మంటలను అర్పేదుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 30 కిమీ దూరంలో ఉన్న తుని నుంచి అగ్నిమాపక శకటం వచ్యే వరకూ మంటలు  చల్లారే పరిస్థితి లేదు.