తెదేపా నేతల అరెస్టు

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై తెదేపా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంల్లో భాగంగా హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ఆ పార్టీ నేతలు ఈ రోజు ధర్నా చేశారు. విద్యుత్‌ సమస్యలపై మధ్యాహ్నం రెండు గంటలలోపు ముఖ్యమంత్రి దిగిరావాలని వారు గడువు విధించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సచివాలయం ముట్టడికి బయల్దేరారు. తెదేపా నేతల ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు ముఖ్య నేతల్ని అదుపులోకి తీసుకుని, ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.