తెరాస నాయకుల అరెస్టు

మెట్‌పల్లి పట్టణం: తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపు  మేరకు సడక్‌ బంద్‌కు వెళ్తున్న తెరాస నాయకులను మెట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చి బస్సు ఎక్కిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా తెరాస నాయకులు నినాదాలు చేశారు.