బెంగాల్‌లో హోరా హోరా

` అటు సగం.. ఇటు సగం
` తణమÖల్, బీజేపీ పార్టీల ఆధిక్యంపై మిశ్రమ ఎగ్జిట్‌పోల్ అంచనాలు
` కేరళలో యÖడీఎఫ్(కాంగ్రెస్)
` అసోం,పుదుచ్చేరిýలో ఎన్‌డీఏ ముందంజ
` తమిళనాడు డీఎంకేదే..
` విడుదలైన ఎగ్జిట్‌పోల్స్
కోల్‌కతా(జనంసాక్షి):బంగాల్ రెండోవిడత పోలింగ్ బుధవారం ముగియటంతో ఎగ్జిట్ ఫలితాలు విడుదలయ్యాయి. బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. అసోంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే హ్యాట్రిక్ కొట్టనుందని ఎగ్జిట్ ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు ఏడు సంస్థలు అంచనాలు విడుదల చేయగా అన్నీ కూడా కమలం పార్టీకే జైకొట్టాయి. అటు కేరళ శాసనసభ ఎన్నికల్లో యÖడీఎఫ్(కాంగ్రెస్) కూటమి విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా మెజార్టీ మార్క్‌ను ఙఆఈ కూటమి అందుకుంటుందని పేర్కొన్నాయి. ఎన్డీఏ కూటమి పెద్దగా ప్రభావం చూపబోదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. అటు తమిళనాడులో హోరారోహీగా సాగిన ముక్కోణపు పోరులో స్టాలిన్ నేతత్వంలోని డీఎంకే విజయ దుందుభి మోగించనుందని మెజారిటీ సంస్థలు అంచనా కట్టాయి.
అసోంలో ఎన్డీయే హ్యాట్రిక్!
అసోంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టనుంది. అసోంలోని 126 శాసనసభ స్థానాలకు ఈనెల 16న పోలింగ్ జరిగింది. ముందస్తు అంచనాలు విడుదల చేసిన సంస్థలన్నీ కమలం పార్టీకే జైకొట్టాయి. మొత్తం 126 స్థానాలకుగాను ఎన్డీయేకు 88 నుంచి 100 స్థానాలు, కాంగ్రెస్‌కు 24 నుంచి 36 స్థానాలు, ఇతరులకు 3 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఎన్డీయే కూటమికి 85 నుంచి 95 స్థానాలు, కాంగ్రెస్‌కు 25 నుంచి 32 సీట్లు, ఇతరులకు ఆరు నుంచి 12 స్థానాలు వస్తాయని మ్యాట్రిజ్ ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్డీయేకు 68 నుంచి 72 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ ముందస్తు అంచనాలు విడుదల చేసింది. కాంగ్రెస్‌కు 22 నుంచి 26 సీట్లు, ఇతరులకు మÖడు నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీయేకు 88నుంచి 98 స్థానాలు చాణక్య స్టాటజీస్ ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేసింది. కాంగ్రెస్‌కు 22 నుంచి 32 సీట్లు, ఇతరులకు 3 నుంచి ఐదు స్థానాలు వస్తాయని పేర్కొంది. పీ`మార్క్ ఙఆఈ 71 నుంచి 79 స్థానాల్లోనూ, ఒఆఈ 62నుంచి 69 స్థానాలు, ఎన్డీఏ ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. జేవీసీ పోల్ ఙఆఈ 72 నుంచి 84 స్థానాల్లో, ఒఆఈ 52 నుంచి 61 స్థానాలు, ఎన్డీయే 3 నుంచి 7 స్థానాల్లో గెలుస్తోందని అంచనా వేసింది.
తమిళనాడులో డీఎంకే అధికారం అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఇదిలా ఉండగా, హోరాహోరీగా సాగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే మరోసారి సత్తా చాటబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీతో జట్టుకట్టి బరిలో దిగిన అన్నాడీఎంకేకు మరోసారి నిరాశ తప్పదని సర్వేలు అభిప్రాయపడ్డాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ పార్టీ టీవీకేకి రెండంకెల సీట్లు రావొచ్చని, అయితే, మÖడో స్థానానికే పరిమితమని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. 234 స్థానాలకుగానూ ఏప్రిల్ 23న తమిళనాడులో పోలింగ్ జరిగింది. అధికారం చేపట్టాలంటే 118 స్థానాలు (మ్యాజిక్ ఫిగర్) అవసరం. మెజారిటీ సర్వేలు డీఎంకే అధికారం రావొచ్చని అంచనా వేశాయి. ఒకవేళ అంచనాలు తలకిందులై స్థానాలు తగ్గితే విజయ్ పార్టీ మద్దతు అవసరమయ్యే అవకాశాలూ కొట్టి పారేయలేమని రాజకీయ పండితులు చెబుతున్నారు. డీఎంకేకు 122 నుంచి 132 సీట్లు, అన్నాడీఎంకేకు 87 నుంచి 100 స్థానాలు టీవీకేకు 10 నుంచి 12, ఇతరులు 0`6 స్థానాలు గెలుస్తారని మ్యాట్రిజ్ అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ డీఎంకేకు 125 నుంచి 145 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకేకు 65 నుంచి 80 స్థానాలు, టీవీకేకు 18 నుంచి 24 సీట్లు, ఇతరులు 0`6 స్థానాలు గెలుస్తారని చెప్పింది. అటు డీఎంకేకు 125 నుంచి 145 సీట్లు, అన్నాడీఎంకేకు 65 నుంచి 85 స్థానాలు, టీవీకేకు 16 నుంచి 26, ఇతరులు 1 నుంచి 6 సీట్లు వస్తాయని వివరించింది. పీపుల్స్ ఇన్‌సైట్ సైతం డీఎంకేకు 120 నుంచి 140 సీట్లు, అన్నాడీఎంకేకు 60 నుంచి 70 స్థానాలు, టీవీకేకు 30 నుంచి 40 సీట్లు, ఇతరులు 0 నుంచి 4 సీట్లు వస్తాయని పేర్కొంది.
పుదుచ్చేరిలో ఎన్‌డీఏదే అధికారమన్న ఎగ్జిట్ పోల్స్
పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎనఆర్ కాంగ్రెస్ (ఏఐఎనఆర్సి) నేతత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్? పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 30అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏకు 16 నుంచి 19 అసెంబ్లీ సీట్లు, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు 10 నుంచి 12 సీట్లు వస్తాయని పీపుల్ పల్స్ అంచనా వేసింది. అంతేకాకుండా, విజయ్?కు చెందిన టీవీకే ఖాతా తెరవదని, ఇతరులు సున్నా నుంచి రెండు సీట్లను గెలుచుకుంటాయని అంచనా వేసింది. ఎన్డీఏ 16 నుంచి 20 సీట్లతో విజయం సాధిస్తుండగా, కాంగ్రెస్ మిత్రపక్షాలు ఆరు నుంచి ఎనిమిది సీట్లను గెలుచుకుంటాయని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీవీకే రెండు నుంచి నాలుగు అసెంబ్లీ సీట్లు, ఇతరులు ఒకటి నుంచి మÖడు సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది.
బంగాల్ ఎగ్జిట్ పోల్స్ హÃరా హÃరీ..
హోరాహోరీగా సాగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలుండగా అధికారం చేపట్టేందుకు 148 స్థానాలు అవసరం. వీటిలో పీపుల్స్ పల్స్, పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తణమÖల్ కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. కాగా మ్యాట్రిజ్, పీ`మార్క్, చాణక్య స్టాటజీస్, పోల్ డైరీ వంటి సర్వేలు ఎన్‌డీఏ వైపు మొగ్గు చూపాయి.

 

మలిదశలోనూ పోటెత్తిన ఓటర్లు
` బెంగాల్‌లో ముగిసిన చివరి విడత పోలింగ్
` భారీగా ఓటింగ్ నమోదు
` సాయంత్రం 5 గంటల వరకు 90 శాతం పోలింగ్
` పలు చోట్ల ఘర్షణలు
` పోలింగ్ సమయం దాటినా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
` మే 4న బంగాల్ సహా 5 రాష్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
బంగాల్‌లో కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 89.99శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్‌లో 294 స్థానాలు ఉండగా ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా బుధవారం 142 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 1,448మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 3.21 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఇVఓలో నిక్షిప్తం చేశారు. ఇందుకోసం 41వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది.పలుచోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. భవానీపుర్ నియోజవర్గంలో సీఎం మమతా బెనర్జీ ఓటు హక్కు వినియోగించున్నారు. టీఎంసీ ఎంపీలు మహువా మెయిత్రా, అభిషేక్ బెనర్జీ, బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో దశలో పోటీ పడుతున్న కీలక అభ్యర్థుల్లో సీఎం దీదీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఉన్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై సువేందు అధికారిని బీజేపీ పోటీకి నిలిపింది. భాత్ పాడా, రాణాఘాట్, కోల్?కతా ఉత్తర్, కోల్?కతా దక్షిణ్, రాశ్ బెహారీ, జాధవ్ పుర్, బాలీగంజ్?లు రెండో దశలో కీలకంగా ఉన్నాయి.
అనేకచోట్ల హింస, ఆస్తుల ధ్వంసం
బంగాల్‌లో తుదిదశ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. అనేకచోట్ల హింస, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయి. చాప్ర, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. చాప్రాలో ఉన్న బూత్ నంబర్ 53లో బీజేపీ ఏజెంట్ మోషారెఫ్ విÖర్‌పై దాడి జరిగింది. వెంటనే అతడిని సవిÖప ఆస్పత్రికి తరలించారు. అధికార Tఓఅకి చెందిన దుండగులు తమ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది.అటు హావ్‌డా జిల్లా బల్లి ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీని వల్ల అక్కడున్న వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది కాస్తా ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఘర్షణను అదుపు చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి. ఓటింగ్ సందర్భంగా హుగ్లీ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నకిలీ పోలింగ్ ఏజెంట్లను నియమించారన్న ఆరోపణలతో Tఓఅ, ఎSఈ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

విజయం మాదే..
` బెంగాల్‌తో సహా 4 రాష్టాలు, యÖటీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
` ఓటింగ్‌లో చురుగ్గా పాల్గొన్న ప్రజలకు అభినందనలు
` మే 4న ఫలితాలు వికసిత భారత్ సంకల్పాన్ని బలోపేతం చేస్తాయి : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ(జనంసాక్షి):ప్రస్తుతం నాలుగు రాష్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడు, అసోం, బంగాల్, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరి ఎన్నికల్లో విజయం తమదేనని పేర్కొన్నారు. బుధవారం బంగాల్ రెండో దశ ఎన్నికల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనడాన్ని ఆయన ప్రశంసించారు. ప్రజాస్వామ్య పండుగల్లో ఇది ఒక ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పండుగలో ఇవాళ కీలకమైన రోజు. బంగాల్‌లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. మొదటి దశ మాదిరిగానే ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేస్తున్నారు. సోషల్ విÖడియాలో పొడవైన క్యూల దశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగాల్‌లో భయరహిత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ, గతంలో అలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం బలపడుతుండడానికి నిదర్శనం. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొంటున్న ఓటర్లకు నా అభినందనలు” అని ప్రధాని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ`ఎన్‌డీఏ కూటమి ఘన విజయం సాధించిందని ప్రధాని గుర్తు చేశారు. ఈ క్రమంలో వరుసగా మÖడో విజయాన్ని కూడా నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, గుజరాత్‌లో మున్సిపాలిటీలు, జిల్లా పంచాయతీలు, నగర పంచాయతీల్లో 80 నుంచి 85 శాతం స్థానాలను బీజేపీ గెలుచుకుందని కూడా మోదీ చెప్పారు. అయితే, మే 4న వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వికసిత్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. అవి దేశాభివద్ధి వేగానికి కొత్త శక్తి ఇవ్వనున్నాయని అన్నారు.మరోవైపు, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి బిల్లు ఇరుపార్టీలు వ్యతిరేకించాయని మండిపడ్డారు. ఆ పార్టీలు అభివద్ధికి, మహిళలకు వ్యతిరేకమన్నారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొంది ఉంటే, 2029 ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాష్ట్రశాసన సభల్లో మహిళలకు రిజర్వేషన్లు లభించేవన్నారు. ఇతర ఏ కేటగిరీలో సీట్లను తగ్గించకుండానే, పెద్ద సంఖ్యలో మహిళలు ఎన్నికై దిల్లీకి చేరుకునేవారని పేర్కొన్నారు. అయితే, సమాజ్ వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలు పట్ల యÖపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు.అలాగే, బీజేపీ హయాంలో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అభివద్ధి గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఒకప్పుడు గుంతల రోడ్లకు గుర్తింపు పొందిన ఉత్తర్‌ప్రదేశ్, ఇప్పుడు అత్యధిక ఎక్స్‌ప్రెస్ వేలు కలిగిన రాష్ట్రంగా మారుతోందని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల యÖపీ అభివద్ధిపథంలో సాగుతోందని ప్రధాని తెలిపారు.