అమరావతి టూ హైదరాబాద్‌కు ఇక 70 నిమిషాలే..
` దక్షిణాదిన బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీని విస్తరిస్తున్నాం
` ప్రకటించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
` మోదీ సర్కారుకు దక్షిణాదిపై ఏమాత్రం వివక్ష లేదని వెల్లడి
విశాఖపట్నం(జనంసాక్షి): గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారుకు దక్షిణాదిపై ఏమాత్రం వివక్ష లేదన్నారు. బుల్లెట్ రైళ్ల ద్వారా దక్షిణాది ముఖచిత్రం మారబోతోందన్నారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరగబోతోందని చెప్పారు.“ బుల్లెట్ రైళ్లతో హైస్పీడ్ డైమండ్ ఏర్పాటుకాబోతోంది. హైస్పీడ్ డైమండ్ దక్షిణాది పట్ల మా నిబద్ధతకు తార్కాణం. దక్షిణాది పట్ల వివక్ష ఉందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దానిని అభివద్ధితో తిప్పికొడుతున్నాం. రైల్వేలు, హైవేలు, విద్యుత్, పోర్టులు ఇలా అన్ని రంగాల్లోనూ దక్షిణాదికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. మోదీ సర్కారు అన్ని రాష్టాలకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. అమరావతి నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. కేవలం 70 నిమిషాల్లో అమరావతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లొచ్చు” అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.దేశం గర్వించే విజనరీ లీడర్ చంద్రబాబు అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కితాబిచ్చారు. గతంలో సైబరాబాద్ నిర్మించారని, ఆయన నిర్మించిన సైబర్ టవర్ ఐటీ అభివద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. మరోసారి చంద్రబాబు నేతత్వంలో విశాఖపట్నం.. ఐటీపట్నం కాబోతోందని ధీమా వ్యక్తంచేశారు. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. “పీఎం మోదీ, సీఎం చంద్రబాబు విజన్‌కు సెల్యూట్ చేస్తున్నా. యువనేత లోకేశ్ ఎనర్జీ నాయకత్వం అద్భుతం. సమస్యలకు పరిష్కారం చూపడంలో యువనేతలకు ఆయన ఆదర్శం. ఏఐ డేటా హబ్ ప్రాజెక్టు నిర్మాణంపై లోకేశ్‌కు చక్కటి స్పష్టత ఉంది. తయారీ రంగంలోనూ నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి.గూగుల్ వంటి పెద్ద సంస్థలు విశాఖకు రావడం శుభపరిణామం. కేంద్రం నుంచి సహకారం అందించడంలో వెనకడుగు లేదు. మారుతున్న కాలంలో ఎలక్టానిక్స్ తయారీ అత్యంత కీలకంగా మారింది. ఎలక్టానిక్స్ తయారీ హబ్‌గా ఇప్పుడు భారత్‌ను ప్రపంచం గుర్తిస్తోంది. ఎలక్టానిక్స్ సరఫరా గొలుసులో ఇప్పుడు భారత్‌ది కీలకపాత్ర. సెవిÖ కండక్లర్ల తయారీ ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తోంది. డాలర్ విలువైన చిప్ దొరకకపోతే మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తి ఆగిపోతుంది.డబులింజిన్ సర్కారులో ఏపీకి రైల్వే నిధులు భారీగా పెరిగాయి. గతంలో ఉమ్మడి ఏపీలో కేవలం రూ.800 కోట్ల రైల్వే నిధులు వచ్చేవి. ఇప్పుడు ఒక్క ఏపీకే రూ.10వేల కోట్లకు పైగా నిధులు వస్తున్నాయి. ప్రస్తుతం రూ.లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఏపీకి ఉన్నాయి. రైల్వే నెట్‌వర్క్‌లో ఏపీలో వందశాతం ఎలక్టిఫికేషన్ పూర్తయింది. జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రారంభమవుతుంది” అని అన్నారు.



