ములుగు టాప్.. హైదరాబాద్ లాస్ట్
` ‘పది’ ఫలితాల్లో సత్తాచాటిన అటవీ ప్రాంత బిడ్డలు
` తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
` మొత్తం 95.1 శాతం ఉత్తీర్ణత
` 96.26 శాతం ఉత్తీర్ణతతో ముందున్న బాలికలు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 95.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 5 లక్షల 28 వేలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత పొందారు. 5,731 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదవగా.. 6 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. పదో తరగతి ఫలితాలను 8096958096 అనే విÖ సేవా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. విÖ సేవా వాట్సాప్ నెంబర్‌కు విద్యార్థులు హాయ్ అని మెసేజ్ టైప్ చేయాలి. తర్వాత ఎసఎస్సి రిజల్ట్స్ అని టైప్ చేసి హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే ఫలితాలను చూడొచ్చు. ఇకపోతే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలుగు విÖడియం విద్యార్థుల్లో 89.14 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇంగ్లీష్ విÖడియం విద్యార్థుల్లో 95.86 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఉర్దూ విÖడియం విద్యార్థుల్లో 86.71 శాతం నమోదయ్యింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. గ్రేడ్స్ మాత్రమే కాకుండా స్జబెక్టుల వారీగా మార్కులను వెల్లడించారు.



