‘తుమ్మిడిహట్టి’పై వేగం పెంచండి

` బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణ త్వరితగతిన చేయాలి
` 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ఇబ్బంది ఉండదు
` ఒకవేళ ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
` ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
` ప్రాణహితపై వెనక్కి తగ్గేది లేదు
` ప్రతిపాదనలు సిద్ధం చేశాం
` మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి): తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 150 విÖటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని అన్నారు. ఒకవేళ ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ బ్యారేజ్‌పై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత` చేవెళ్ల ప్రాజెక్టుపై రూ.11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం సూచించారు.
ప్రాణహితపై వెనక్కి తగ్గేది లేదు :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రాణహిత`చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హావిÖ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. మంత్రి బుధవారం విÖడియాతో మాట్లాడారు. తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ద్వారా ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ సమిష్టిగా నాలుగు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తెచ్చారని వివరించారు. ప్రతీ ప్రతిపాదనకు అయ్యో ఖర్చు, అనుకూల, ప్రతీ కూలతలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరగనున్న సవిÖక్షా సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలను వర్షాకాలం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతీ 1.5 విÖటర్ల దూరంలో ఎస్పీటీ టెస్ట్‌లు నిర్వహించాలి. ప్రతీ మÖడు విÖటర్ల దూరంలో పెర్మిబిలిటీ టెస్ట్‌లు జరపాలి. బోర్లు వేస్తున్న సమయంలో రాయి వచ్చినప్పటికీ రాయి లోపటికి 5 విÖటర్లు లోతుగా బోర్లు వెయ్యాలి. బ్యారేజ్ ల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటీ బ్యారేజ్‌లను సందర్శించి టైంలైన్‌ను ఫిక్స్ చేసుకోవాలి. అచిఖఖా డైరెక్టర్ క్షేత్ర స్థాయిలో ఉంటూ పునరుద్ధరణకు అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలి. పునరుద్ధరణ కోసం జరుగుతున్న పురోగతి పనుల వివరాలను ఎప్పటికప్ప్పుడు సమగ్రంగా సమాచారం అందించాలి.‘ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు.

 

వదంతులతోనే భారీగా కోనుగోళ్లు
` తెలంగాణలో పెట్రోలియం ఉత్పత్తులకు అకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది:ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో పెట్రోలియం ఉత్పత్తులకు అకస్మాత్తుగా డిమాండ్ పెరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఖమ్మం, మిర్యాలగూడ, నిర్మల్ వంటి సరిహద్దు ప్రాంతాలపై దీని ప్రభావం పడిందన్నారు. వదంతులతో ప్రజలు అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయనే ఊహాగానాలతో పరిస్థితి తీవ్రమైందన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. “ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 24 గంటలూ పనిచేయాలని కోరాం. రాష్ట్రవ్యాప్తంగా 3,817 ట్యాంకర్లు పంపారు. పరిస్థితులపై అంచనాకు కలెక్టర్లతో జిల్లా ఇంధన సరఫరా కమిటీని ఏర్పాటు చేశాం. ఇంధన నిల్వల పర్యవేక్షణకు అధికారులను సిద్ధంగా ఉంచాం. పెట్రోల్, డీజిల్ అవుట్‌లెట్లలో ప్రతి నాలుగు గంటలకు తాజా సమాచారం తీసుకుంటూ సరిపడా నిల్వలు ఉంచేలా పర్యవేక్షిస్తున్నాం. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలి” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇంధన సరఫరాపై కిషన్‌రెడ్డి సవిÖక్ష
తెలంగాణలో ఇంధన సరఫరాపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవిÖక్ష నిర్వహించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధులతో సోమాజిగూడ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ సమస్య రాకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో దుష్పచారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇంధనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడానికైనా కేంద్రం సిద్ధమని ప్రకటించారు.

 

90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు లక్ష్యం
` 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
` మొత్తం 8,525 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
` మిల్లులకు చేరిన 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
` పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వరి ధాన్యం కొనుగోలు పక్రియ అత్యంత వేగంగా, పారదర్శకంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ’ప్రభుత్వం ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 8,525 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 6,500కు పైగా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఐకేపీ ఆధ్వర్యంలో 2,623, వివిధ సొసైటీల ద్వారా 3,278 కేంద్రాలు నడుస్తున్నాయి. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు 6,500 లారీలను సిద్ధం చేశారు. ఇప్పటికే 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరింది. ధాన్యం నిల్వ కోసం ముందస్తుగా 20 కోట్ల గన్నీ సంచులను సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు రూ. 2,031 కోట్ల విలువైన 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రైతులకు ఇప్పటికే రూ. 323 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేశారు. 3.46 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయడం ద్వారా 64,779 మంది రైతులకు లబ్ది చేకూరింది. అలాగే, 30,220 మెట్రిక్ టన్నుల సెనగ కొనుగోలు పక్రియ పూర్తయ్యిందని అన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో మొత్తం 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించేందుకు నిరుటి కంటే ఈసారి కేంద్రాల సంఖ్యను పెంచిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపాదించిన 8,525 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 6,500కు పైగా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఐకేపీ ఆధ్వర్యంలో 2,623 కేంద్రాలు, సొసైటీల ద్వారా 3,278 కేంద్రాలు, ఇతర సహకార సంస్థల ద్వారా 353 కేంద్రాలు పని చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో దాదాపు 43,000 మంది శిక్షణ పొందిన సిబ్బంది కొనుగోళ్లలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు మంగళవారం నాటికి సుమారు 8.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు పూర్తయింది. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యంలో దొడ్డు, సన్న రకాలుగా విభజించి సేకరణ కొనసాగుతోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6,500 లారీలను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం మిల్లులకు తరలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఆటోమేటెడ్ డైయర్లు, క్లీనర్లు, మాయిశ్చర్ విÖటర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచారు. అదనంగా, సుమారు 20 కోట్ల గన్నీ సంచులు ముందుగానే నిల్వ ఉంచారు, తద్వారా కొనుగోళ్లు ఎక్కడా నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు. రైతులకు చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.2031 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా.. ఇప్పటికే దాదాపు రూ.323 కోట్లు రైతులకు చెల్లించారు. వెంట వెంటనే చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధాన్యంతో పాటు రాష్ట్రంలో ఇతర పంటల కొనుగోళ్లు కూడా కొనసాగు తున్నాయి. ఈసారి 43.20 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి అంచనాలున్నాయి. ఇప్పటివరకు 3.46 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగాయి. దాదాపు రూ.830.69 కోట్ల విలువైన కొనుగోళ్లతో 64,779 మంది రైతులు లబ్ది పొందారు. 1.25 లక్షల మెట్రిక్ టన్నుల సెనగ పంట దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 30,220 మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగింది. దీనివల్ల 15,933 మంది రైతులు లబ్ది పొందారు. పొద్దుతిరుగుడు పంటకు 19,808 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేయగా, ఇప్పటివరకు 3,492 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయింది. 2,512 మంది రైతుల నుంచి కొనుగోళ్లు జరిగాయి. అన్ని జిల్లాల్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా కొనసాగుతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర అందించటంతో పాటు సౌకర్యవంతమైన సేవలు, తక్షణ చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.