విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం

వెల్దండ ఏప్రిల్ 11 ( జనంసాక్షి ) :వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో ఇది స్తంభాలకు, వైర్లకు మొక్కల తీగలు అల్లుకొని ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. స్తంభాల వైర్లకు పచ్చని తీగలు ఎగబాకి వైర్లు స్తంభాలు కనిపించనంతగా ఉన్నాయి. ఈదురుగాలులు వీచే సమయంలో ఇవి ప్రమాద తీవ్రతను పెంచుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకొని పిచ్చి మొక్కలను తొలగించాలని గ్రామ ప్రజలు పలువురు కోరుతున్నారు.

