తెరాస సీనియర్ నాయకుడు కిషన్ నాయక్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరం.

తెరాస రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తం రావు.
తాండూరు సెప్టెంబర్ 9(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం జంటుపల్లి -పటేల్ చింత తండా తెరాస సీనియర్ నాయకుడు కిషన్ నాయక్ అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని తెరాస రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తం రావు తెలిపారు. శుక్రవారం పటేల్ చింత తండాలో తెరాస నాయకుడు కిషన్ నాయక్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని తెరాస రాష్ట్ర మాజీ కార్యదర్శి, కరణం పురుషోత్తం రావు, పటేల్ చింత తాండకు వెళ్లి కిషన్ నాయక్ పార్థివవాదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంభ సభ్యులను పరామర్శించారు. తెరాస మంచి నాయకున్ని కోల్పోయిందని తెలిపారు.కిషన్ నాయక్ కుటుంబానికి తెరాస పార్టీ అండగా ఉంటుందని అయన తెలిపారు. పరామర్శించిన వారిలో పిఎసిఎస్ ఛైర్మెన్ సురేందర్ రెడ్డి, జంటుపల్లి సర్పంచ్, వెంకట్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రామారావు,నాయకులు ముకుంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.