తెలంగాణలో భానుడి ప్రతాపం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతను తట్టుకోలేక పలువురు మృత్యువాత పడుతున్నారు. అత్యధికంగా నల్గొండలో 74 మంది మృతి చెందారు. వివిధ జిల్లాల్లో శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ – 46.0, ఖమ్మం – 46.0, వరంగల్ – 46.0, నిజామాబాద్ – 45.1, ఆదిలాబాద్ – 44.3, కరీంనగర్ – 43.7, హైదరాబాద్ – 43.0, మహబూబ్ నగర్ – 42.6, రంగారెడ్డి – 42.1, మెదక్ – 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


