తెలంగాణవ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేత

హైదరాబాద్‌: తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ పది జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు నల్లజెండాలను ఎగురవేశారు. నల్లబ్యాడ్జీలను ధరించి ర్యాలీలు తీశారు. చౌరస్తాల వద్ద జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి డీసీసీ కార్యాలయాలను ముట్టడించారు. నిరసన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. సీమాంధ్రులకు తగిన బుద్ధి చెబుతామని తెలంగాణవాదులు స్పష్టం చేస్తున్నారు.