తెలంగాణా రాష్ట్రం ఎన్నికల్లోనే పోటీ చేస్తా : షబ్బీర్‌

నిజామాబాద్‌ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్‌ అదిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆవాభవం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికల్లో పోటీ చేయను అని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టులో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లాకు మెడికల్‌ సీట్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.