తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఎందుకో నాకంటే గురయ్యగాడినే ఎక్కువగా యిష్టపడేయి. దర్గాలో కాలుపేడ్తామొ లేదో ఒక సుక్కల సుక్కల (బట్టల బట్టల) పావురముండేది, అది గురయ్యగాడి బుజంమీద కూకునేది. ముక్కుతో వాడి బుగ్గల్ని ముద్దు పెట్కునేది, లాబుగా వున్న దాని మెడను సాపి గురయ్యగాడి మెడతో కలిపేది. సెవుదగ్గర కెల్లి గుడుం, గుడం అని సప్పుడు సేసేది.సేతులమీద సున్నితంగా పొడిసి గింజల్ని తోందర్గా యిస్రూ నా పిల్లల నోళ్ళలో పెట్టాలని అన్నట్లుగా అన్పిచ్చేది మాకు.

అట్నే ఒక కాలు సొట్టపోయిన కుంటి పావురమూ వుండేది. మా యిద్దర్లో ఎవరో ఒకరిమీద కూకోబోయి పొరపాట్న న్యాల మీన వాలి నడుసుకొంటూ మా దగ్గరికొచ్చేది. దాన్ని కూడా జాలితో నా గురయ్యగాడు ఎంతో ఆప్యాయంగా దగ్గరకు రానిచ్చి సేతుల్లోకి తీసుకోని శ్యానాసేపు దాని అవిటి కాలుకేసి సూసేటోడు. అది ఎంతకీ మమ్మల్ని యిడిసిపెట్టిపోయ్యేది కాదు. అది ఎక్కడ ఎగర్ల్యాక కుక్కలకు, గద్దలకు సిక్కివాటికి ఆహా రమై పోతాదోనని బెంగ పడేటోల్లం, దాన్ని సూసి నప్పుడల్లా.

కొంత దర్గా మైదానంలోపలికి పోయినాక బోల్డన్ని ఖబుతరాంలు, మూకుమ్మడిగా గురయ్యగాడిమీద ప్రేమ దాడి సేసేయి. తమ బుల్లి బుల్లి ముక్కుల్తో గురయ్యగాడ్ని ముద్దుపెట్టుకోనేయి.

నా మీద మాత్రం ఏ నాలుగో అయిదో వాలేయి. గురయ్యగాడి అదృష్టం సూసి నాకు శ్యానా ఈర్ష్య గా వుండేది. మా సేతుల్లోని గింజల్ని సల్లి చౌంత్రా మీద కూకోని వాటి తట్టు ఆప్యాయంగా సూసె టోల్లం. గింజలు తింటున్న పావురాల్ల వైపు పర  వశంతో సూసే గురయ్యగాడు నాకు ఇంకా ఆత్మీ యంగా కన్పడేటోడు. గట్టిగా వాటేసుకోని ముద్దెట్టుకుందామా అన్పిచ్చేది. పావురాల్లు గింజ ల్ని నోట్లో పెట్టుకెల్లి వాటి పిల్లల నోల్లల్లో పెట్టి మా వైపు ఆరాధనంగా సూస్సాండేయి.

కాలేజికి టైమైతాంది పోదం అన్న్యా ఆ కబూతరా లను యిడిసి వచ్చేటోడు కాదు. ‘అబ్బా అప్పుడే ఏం లేరా పోదాంలే ఇంకా కాసేపుండి. నువు కూ డా కూకో’ అనేటోడు నన్ను నేను తొందర సెయ్యంగ ఇక ఆఖరికి తన వల్లో వాలీన కబూత రాల కల్ల మీద ముద్దెట్టుకోని లాలనగా వాటిని యిడిసి శానా భారంగా కదిలేటోడు.

అట్నే మేమిద్దరం కల్సి మంచి నీళ్ళకని ఊరి బైట కొత్తరెడ్డి బాయికెళ్ళెటోల్లం. అక్కడ కడవల్తో నీల్లు ముంచుకుంటాంటే సిన్నసిన్న సేప్పిల్లలు మా కాళ్ళను తాకుతూ ఉండేవి. ఒక్కోక్కసారి పొద్దు గూకే జామున మేము నీల్లలో కాల్పెడ్తామో లేదో సేపలు వాటి సిన్నిసిన్ని నోల్లతో సిన్నగా కరిసేవి. అప్పుడు నేను ‘వరే! ఈ సేప్పిల్లలకుగ్గూడా ఆకలే స్సాందేమోరా, మనుషులు మనల్ని పట్కోనిపోయి కూరొండుకోని తింటారనే భయం కూడా ల్యాకుం డా మన కాడి కొస్సాండాయి సూడు’ అని నా గురయ్యగాడితో అంటే-‘అవున్రా నిజమే ఈ చాప్పిల్లలక్కూడా ఈలైతే సుక్కురారం మాట్యాల ప్పుడొచ్చి బొరుగులు తీస్కోచ్చేసి పోదాం’ అని గురయ్య గాడన్నాడు. ఆరోజునుంచి మా దగ్గర లేక్కుంటే సుక్కురారం మాట్యాల చాప్పిల్లలకు బొరుగులు, అట్నే మేం పొయ్యే దావలో కన్పడే సీమలకు రోన్ని సూగ్గింజలు కూడా పట్కెల్లి సల్లేటోల్లం.

అది పందోమ్మిది వందలా తొంబై రెండు డిశంబర్‌ ఆరు. ఎక్కడో బాబ్రీ మసీదు కూల్చినారంట. ముస్లిలంతా పాకిస్తాన్‌ పోవాలని నినా దాలు…సాయిబులంతా దేశ ద్రోహులని వాద నలు…అక్కడక్కడా ఎర్రటి రక్తం…ఎక్కువగా ముస్లింలది..కొంత హిందువులది..కాని యిది అమాయకుల రక్తం…అట్టా ఆ వివాదం మా పోరుమామిళ్ళ కొచ్చింది. ఏరోడ్డు మీదనైతే అంద రూ కల్సి తిరిగేటోల్లో ఆరోడ్డు మీదనే విభజన రేఖ గీయబడింది..మామ, అయ్య, పెద్నాయన, అన్న, తమ్ముడూ అని వరుసలు కలుపుకొని పలకరించు కొనే పిలుచుకొనే నోళ్ళే చంపేస్తాం, నరికేస్తాం అని అరచుకొన్నాయి…భుజాల మీద వేసుకున్న చేతులే మారణాయుదాలు పట్టుకొన్నాయి…

ఆప్యాయత లొలికించిన కళ్ళలో ఎందుకో తెలి యని కసి…తాత్కాలికమైన కసి, చాలా మంది లో..శాశ్వతమైన కసి, కొందరిలో…

ఆ సంఘటన తర్వాత నా గుండెను ఎవరో అదే పనిగా గుండు పిన్నుల్తో గుచ్చుతున్నారనిపించేది. గుండె నుంచి కన్నీళ్ళు కారేయి. విభజన రేఖకు ఆవల కొందరి చేతుల్లో మిలమిల మెరిసే కత్తుల ప్రతిబింబాలు నా కళ్లలో…

వారం రోజులు గురయ్యగాడు, నేను ఒకర్నోకరం కల్సుకోలేకపోయం.వారం తర్వాత కాలేజిలో కల్సిన గురయ్యతో అన్నాను, ‘రేపు సుక్కురారం పావురాలకు గింజలెద్దా’మని. గురయ్య నేను ఈ రోజు సాయంత్రమే వేరే ఊరెల్లుతునాను. .కొంత కాలం రాను’ అని ముక్తసరి సమాధానం చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయిండు. గురయ్య కొన్నాల్లై న్యాక కన్పడినాడు. కానీ వాడు ముభావంగా వుంటూ సరిగ మాట్టాడ్డంల్యా. నా బెంచిలో నా పక్కనే కూకుంటున్నోడు బెంచి మార్సేసిండు. మునుపటి మాదిరిగ సుక్కురారం రోజున పావు రాలకు దానా వేయటానికి రావటం మానేశాడు. ఇంతకు మునుపు తన సోక్కాపై కన్పడేల మొడలో వేసుకోని మౌలాలి సోమి ‘తాబీజు’ కన్పడటం మానేసింది. దర్గా చ్ఛాయలక్కూడా రావటం లేదిప్పుడు.. ఒకప్పుడు మా ఇంటికి రాకుండా ఉండలేకపోయేటోడు ఇప్పుుడు ఇంటికి రావటం తగ్గించేశాడు. గతంలో నేను వాళ్లింటి కెలితే సంబ రపడిపోయి వాళ్లింటో యాలకుతో చేేసిన సంగ టో, బువ్వో తినకుండా వెళ్లనిచ్చేవోడు కాదు. కానీ ఇప్పటి వాడి యవ్వారం మునుపటి కంటే భిన్నం గా వుంది. నేనడిగిన ప్రశ్నకు మాత్రం ఆ, ఊ అని ఇష్టముండి లేనట్టు జవాబు చెప్తాండడు. పైగా వాడింటి కెళ్తే ఎందుకొచ్చావ్‌ అన్నెట్టు ప్రశ్న ము ఖం కన్పడేది వాడి సూపులో మునుపు వెల్తా నంటే బంగపోయి బంగపోయి ఏమోమో సెప్పి వాడితో టినే వుంచుకొనేటోడు ఇప్పుడు ఎళ్లోస్సా నంటే ఇష్టముండి ల్యాక ఆ అనడం మొదలెట్టాడు, ఇదం తా నాకు భరింపశక్యం కానంతగా తయారైంది పరిస్సితి.

నన్ను దోషిగా చూస్సున్నట్టుండేవి వాడికళ్లు. నా కళ్లు వీటిని సూడల్యాక ఏడ్సేవి. పరుగెత్తి కెల్లి గుండెలకు హత్తుకుందామా అన్పించేది నాకు- అంతలోనే తోసేస్తాడేమోనని భయమేసేది.

ఒక రోజు రాతిరి సుక్కల చిచ్చుబుడ్లు కాల్చినట్లు, చంద్రుని భూ సెక్రం పేల్చినట్లు ఆకాశమంతా భూలోకమంతా కన్నులు మిరిమిట్లు గొలిపే వెన్నెల పరుచుకొంది. సల్లటి గాలీస్తుంది. అయినా నేను ఆలోచనల వేడికి వుక్కిరి బిక్కిర వుతున్నా. ఎంత ప్రయత్నించినా ఆ రాత్రి నిద్రప ట్టలేదు. పొద్దున్నే లేచాను. బెన్నెబెన్నె గురయ్యో ల్లింటికి ఎళ్తున్నా మా మునుపటి తీపి గ్యాపకా లను గుర్తుచేసుకుంటూ.. ఆ తీపి గ్యాపకా కమ్మటి అనుభూతుల్లో నుంచి బయటపడేలోపే గురయ్యో ల్లయిల్లు వచ్చింది. గుమ్మం బైటి నుంచే ‘గురయ్యా’ అని పిలిచాను. ఎంతలోతు తవ్వినా నీళ్లు పనుంచి వచ్చినప్పుడు    మాద్రిగ్యా   అయి ష్టంగా విన్పించింది. వాడి జవాబు. ఇంటిలో పలికి నాలుగడుడులేశాను. ఏమిటి అన్నట్లు కను బొమ్మలేగరేసిండు లోపలి గదిలో నుంచి ఎందుకిలా మారిపోతాండవ్‌ అన్న నా గొంతులో నుంచి వచ్చిన ప్రశ్నతో పాటుగా నా చెక్కిల్ల యమ్మటి బొట బొటామని కల్లనీల్లు కూడా జారినాయి. ఇదంతా ఒరకంట గమనిస్సానే ఉండాడు.

అయినా వాడి పాషాణంలాంటి గుండెకాయ కరిగినట్టులేదు. అందుకే నా కల మ్మడి కార్నె నీల్లు వాన్ని కదిలించలేకపోయినయి. వాడి విపరీత ప్రవర్తనకు కారణమేంటో తెలుసు కోవాలనే నా ఆరాటం ముందు మొండిగా నన్ను చీత్కారభావంతో చూసే వాడి సూపుదే పైచేయి అ యింది.

ఎంతో అప్యాయంగా, ప్రేమగా, ఆద రంగా, అభిమానంగా, స్నేహానికి ప్రతీకగా చెప్పుు కోబడే నాగురయ్యగాడి మంచిమనసుల ఎట్టాయిసం కల్సిందో ఊహించుకోడాగ్గూడా వీలు కాకుండా వుంది. నా వైపు నుంచి ఏమైనా పొరపాటు జరిగిందా అని మల్లా మల్లా ఆలోచన సేసుకున్యా అలాంటిది ఏమి లేనట్లే నాకు తెలుస్సాంది.

ఈ ఆలోచనలతో మదనపడతానే ఏమేగాని మాట్లాడకుంగా యిల్లు చేరుకున్నా చాలా కట్టం మ్మీద ఒకటిరెండు రోజులు వాడితో కల్వకుండా ఉండగలిగినా.

కొన్నాళ్లానై తర్వాత రెవెన్యూ గ్రామ సావిడి, దగ్గర నిలబడి ఎవర్తోనో మాట్లాడుతున్న గురయ్య దగ్గరికి నేనే పోయి, ‘మాట్లాడాల అటు పక్కకు వెళ్దామని పిలిచినా, వచ్చిరాంగనే ‘ఏంటి విషయం తొందరగా సెప్పుు’ అని తొందర పడిండు.

నేనే గురయ్యా! ఏంటి మునుపటి మాద్రిగా కాకుండా నాతో అదోలా అంటీ, అంట నట్టు, కలిసి కలవనట్లు దూరం దూరంగా వుంటా ండవ్‌? ఏంటి అంతగా నేను నీకు చేయరాని ద్రోహం చేశానా? ఎందుకట్టా మారిపోయినవ్‌?! అని బాధపడ్డా, దానికి కొంతసేపు ఆలోచించి అదేమీ లేదు-నువ్వు ఊరకూరక ఏవేవో ఊహించుకొంటాండవ్‌- అంతేకానీ మరేమిలేదు’ అని మాట దాటేయడానికి సూసిండు.

నేను బాధపడుతూనే ‘సర్లేరా, నాతో మాట్లాడకపోతే మాన్లేగానీ రేపు సుక్కురారం.. మనిద్దరం పావురాల్లకు గింజలేసి శానారోజు లైంది. రేపైనా దర్గాకు పోదాం’ అన్నా ను. నా మాటలు విన్నతోనే ఏంటో గురయ్యగాడు ఒక రకంగా నవ్వినాడు. నన్ను కలుపుకొనే దానికే మోననుకున్నా అంతోలనే ‘సర్లేపోదాం’ అని ఒప్పు కున్నాడు. ఎమ్మట్నే ఒక మెలిక పెట్టి – కాకపోతే ఇంతకు ముందు మాదిరి కాకుండా కొంచెం నిదా నంగా పోదాం. నువ్వు మీ ఇంటి కాన్నించి నేరు గా అట్నేరా దర్గా దగ్గరికి. ఇద్దరం దర్గా దగ్గిరే కల్సుకుందాం. ఇక పోయిరా..’ అని నాతో సెప్పి దూరంగా నిలవడిన కొత్తోల్లతో మాటల్లో పడి పోయినాడు గురయ్య.

శ్యానా కాలం తర్వాత దర్గాకు నా గురయ్యగాడు వస్తానటంతో నాకు శానా సంతోష మేసింది. పొద్దున్నే నిద్రలేసి సెప్పలేని ఆనందంతో దర్గా తట్టుకు బయలేర్దినా. నాకంటే ముందుగా గురయ్యగాడొచ్చి నా కోసం ఎదురు చూస్తుంటా డేమోనని దూరంనుంచే దర్గా వైపు సూస్కుంటూ వచ్చినా, ఖబుతరాలకోసం నా కళ్లు అవకాశం వైపు చూడసాగాయి. దర్గా దగ్గర పడే కొద్ది ఉరికెత్తుకుంటూ పోయినా. చేతిలో గింజల్ని గట్టి గా పట్టుకొని సంతోషం నిండిన కళ్లతో దర్గాలో అడుగుపెట్టినా. కాలి కింద ఏదో మెత్తగా తగల టంతో ఉలిక్కిపడి కాలు వెనక్కుతీస్కొని కింద సూసేటప్పుటికి ముక్కులోంచి నెత్తురు కారుతూ నీలక్కపోయిన కాళ్లతో తేలిపోయిన కళ్లతో వణు కుతున్న ఈకెలతో చుక్క చుక్కల పావురం.. దానికి కొద్దిదూరంలోనే కుంటి పావురం.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది….
తెలంగాణ అతెలంగాణ అలాయ్‌ బలాయ్‌లాయ్‌ బలాయ్‌