చర్చకు ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన కేటీఆర్
` మాట తప్పడం రేవంత్‌కు అలవాటైంది
` ఆరు గ్యారెంటీలు..420 హామీలతో మోసం
` నీళ్లు ఆంధ్రాకు…నిధులు ఢల్లీికి.. నియామకాలు సొంతవారికని ఆగ్రహం
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం,పోరాటం నీళ్లు, నిధులు, నియామకాలకోసమే అన్నది అందరికీ తెలుసని, కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే అనుసరిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు. నీళ్లేమో ఆంధ్రాకు, నిధులు రాహుల్‌కు, నియామకాలు కొందరు తాబేదార్లకు అప్పగించారని మండిపడ్డారు. మాట తప్పడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనని కేటీఆర్ అన్నారు. రైతు సంక్షేమం తదితర అంవాలపై చర్చకు సిద్ధమంటూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రెస్‌క్లబ్ వద్దకు వచ్చారు. ఆయన వెంట మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. చర్చ కోసం ఓ కేª`చీలో సిఎం కోసం అంటూ ఖాళీగా పెట్టారు. ఈ సందర్భంగా కెటిఆర్ విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అరాచక పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు గ్యారంటీలు, 420 హావిూలు అంటూ ప్రజలను మోసం చేశారు. బేసిన్ల నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ లేని సీఎం చర్చకు రావాలి. బహిరంగ చర్చకు రేవంత్‌రెడ్డి సవాలు విసిరితే మేం వచ్చాం. సవాలు విసిరిన సీఎం ఇక్కడకు ఎందుకు రాలేదు? సీఎం రాకపోతే మంత్రులైనా వస్తారని భావించాం. బహిరంగచర్చకు రావాలని సీఎంకు మరోసారి చెబుతున్నాం. కొత్త తేదీ, ప్రదేశం రేవంత్‌రెడ్డి చెబితే మేం తప్పకుండా వస్తాం. అసెంబ్లీలో చర్చించేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం. మైకులు కట్ చేయకుండా.. పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధం అని కేటీఆర్ అన్నారు. 18 నెలలుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హావిూని కూడా నిలబెట్టుకోకుండా రంకెలేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదని ఎద్దేవా చేశారు. రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తే ఆయన చర్చకు రాలేదని, రేవంత్ మాట తప్పుతారని తెలిసినా సవాల్‌ను స్వీకరించామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ నిధులు ఢల్లీికి పోతున్నాయని, రైతులపై సీఎం రేవంత్ రెడ్డికి గౌరవం లేదని ఆరోపించారు. సీఎం ఢల్లీికి ఎందుకు వెళ్లారని అడిగితే ఎరువుల బస్తాల కోసమని చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఎవరికి బస్తాలు మోస్తున్నారో తెలియంది కాదని అన్నారు. రైతుబంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారని, కొడంగల్‌లో ఎంతమంది రైతులకు రైతుబంధు పడలేదో జాబితా సిద్దంగా ఉందని చెప్పారు. రైతుల మరణాల జాబితా కూడా తీసుకొచ్చామని, ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమంటే సంక్షేమ పాలన అందిస్తారని అనుకున్నామని అన్నారు. కానీ పోలీస్ పాలన నడుస్తోందన్నారు. గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా పట్టింపు లేదన్నారు. చర్చ కోసం రేవంత్ ఇంటికి రమ్మన్నా వెళ్తామని చెప్పారు. రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము చాలని అన్నారు. కాంగ్రెస్ నేతలకు నిజాయితీ ఉంటే చర్చకు రావాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. కేటీఆర్‌తో చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దని చెప్పారు. రేవంత్ రెడ్డి ఢల్లీి వెళ్ళింది యూరియా బస్తాల కోసం కాదని, ఏ బస్తాలు మోసి రేవంత్ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నారో అందరికీ తెలుసని అన్నారు. రేవంత్ హయాంలో నీళ్ళు ఆంధ్రకు.. నిధులు ఢల్లీికి.. నియామకాలు రేవంత్ తొత్తులకు దక్కుతున్నాయని అన్నారు. గురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్ళను ఆంధ్రకు పంపుతున్నారని ఆరోపించారు.రేవంత్ మోసాలు చేసి నాలుగు రోజులు తప్పించుకోవచ్చని, కానీ ప్రజలు క్షమించరని కేటీఆర్ అన్నారు.సవాల్ విసిరి మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటని ఆరోపించారు. 2018లో కొండగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, ఆ తర్వాత మాట తప్పాడని గుర్తుచేశారు. అందకుముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన విూడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ ఇచ్చిన హావిూల అమలుపై ఈ ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని కేటీఆర్ అన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎన్నో సార్లు ఆహ్వానించాం. అసెంబ్లీలో కాదంటే.. ప్రెస్‌క్లబ్‌లోనైనా చర్చకు రావాలని చెప్పా. రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించా. సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీలో ఉన్నారని తెలిసింది… సీఎం రాకుంటే మంత్రులైనా రావాలి. సీఎం ఇవాళ హాజరుకాకుంటే.. మరో రోజు చర్చకైనా మేం సిద్ధం. సీఎం రేవంత్‌రెడ్డికి వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలని అడుగుతున్నాం. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని హావిూ ఇస్తే.. అసెంబ్లీలో కూడా సిద్ధం. ఈ ప్రభుత్వం ఒక్క హావిూని కూడా నెరవేర్చలేదు. రేవంత్‌రెడ్డి తప్పుకొంటే.. అభివృద్ధి అంటే ఏంటో కేసీఆర్ చేసి చూపిస్తారని కేటీఆర్ అన్నారు. విూడియాతో మాట్లాడిన తర్వాత పార్టీ నేతలతో కలిసి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు బయల్దేరారు.