తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

19 వ శాతాబ్ది అంతం వరకూ మత కల హాలు  లేనేలేవని సాక్ష్యా ధారాలతో సహా ప్రఖ్యాత చారిత్రకవేత్త రోమిల్లా థాపర్‌ ఎత్తి చూపించారు. ఎన్నడో ఎవరివల్లో జరిగిన అపరాధాలకు యివా ల్టి ముస్లింలందర్ని బాధ్యుల్ని చేసే ఈ ప్రవృత్తికి గొర్రె దాటుడు జనాల ద్వేషం ఒక్కటే కారణం. మ రోక చారిత్రక నేపథ్యం ఏదీ దీనిక్కారణం కాదు.

ఏ దేశంలోనైనా రెండోశ్రేణి ప్రజలు మాత్రమే ఇలాంటి ఎన్నడో జరిగిన తప్పులకి సంకేతాలుగా మారిపోతున్నారు. మొత్తం ఆ జాతిజనాలు అపరా ధుల్లా కనిపిస్తారు. యూరప్‌లోనూ క్రిస్టియన్‌లకు యూదులుగా అసలు మనుష్యుల్లాగే కన్పించరు. వాళ్లు పాపం తాలూకు అపరాధం బాపతు సంకే తాల్లాగా మోపి నలభై మిలియన్ల యూదుల్ని చిత్ర హింసల పాలుచేసి వధించిన క్రిస్టియన్‌ల ఈ ప్రవృత్తి జర్మన్‌ నాజీ పరిపాలనలో పరాకొష్టకు చేరింది. భారతదేశంలో ముస్లిం మీద జరుగు తున్న దాడులకూ, నాజీ పైశాచికత్వానికి పెద్దగా మూలంలో వ్యత్యాసాల్వేవు. ఉన్న వ్యత్యాసాలు ఏవైనప్పటికీ కేవలం వివరాలకు సంబంధించి నవి. ముస్లింలను సదా సంవయాల తోనూ ద్వేష భావంతోనూ చూసే ధోరణి కూడా నాజీ సిద్ధాంతా నికి అసలు సిసలు నకలు.

ముస్లింలు మన దేశంలోని రెండోశ్రేణి ప్రజ లు కావడం చేత వాళ్లకు భారతీయులు కావడం కోసం దేశం పట్ల భక్తి  ప్రవత్తులు కలిగుండటం కోరకు, హిందూ మతాన్ని గౌరవించడం కోసం దేశ సంస్కృతికి సంబందధించిన ప్రదధాన స్రవం తిలో చేరడం కోరకు సదా పిలుపు నివ్వడం జరు గుతుంది. ఇవన్నీ వాళ్ల మంచి కోసమే అఏ ఔదా ర్యాన్ని చూపించడం మన స్వదేశీ బ్రాంచి ఫాసి స్టులు మరవడం లేదు. రెండోశ్రేణి ప్రజలకు తమ మంచి తాలూకు దారి ఏమాత్రం తెలియదన్న మాట. వాళ్లకి ఏది మంచి దారో ఎంచుకునే హక్కు కూడా ఉండదన్నమాట. వాళ్లు ఎల్లప్పుడూ వాళ్ల మంచికోసమే  సంస్కృతికి  సంబందించిన ప్రదాన స్రవంతిలో ఒక్కటయిపోవాలి.బహుశ సం ఖ్యాక వర్గాల భాషే మాట్లాడాలి ఇల్లూ , వాకిలీ, భార్యాపిల్లలూ, తిండీ తిప్పలు తాప్తయాలతో సత మతమవుతోన్న మనుషులతో వాళ్ల కష్టసుఖాల గురించి మనం నాలుగు మంచి మాటలు మాట్లా డితే బావుంటుంది. కానీ సంస్కృతి, మతం భాష, ఇలాంటి ప్రధాన స్రవంతుల్లో కలిసిపోండి. అదీ మీ మంచికే అంటూ వాళ్లకి పిచ్చిపిచ్చిగా పిలుపు లు ఇవ్వకూడదు. ఆ మనుష్యులు రెండో శ్రేణి ప్రజలుగా చూడబడుతున్నప్పుడు, వాళ్లని ఒక అప రాధాల సంకేతాలుగా పరిగణదిస్తున్నప్పుడు మా త్రమే మనమిలాంటి పిలుపులతో అవమానించ గలం. ఏ వ్యక్తినైనా ఎన్నడో జరిగిపోయిన తప్పిదా లకు బాధ్యున్ని చేయడమంటే అతని వ్యక్తిత్యాన్ని నిలువునా కాల్చడమన్నమాట. మతకలహాలతో జరిగే ప్రాణ నష్టాలన్నీ తార్కికంగా ఈ బౌద్దిక హ త్యలకు పూర్వ రంగాలవుతున్నాయి. మన ఉదార వాదులు కూడా గమనించాల్సిన విషయాలివి ముస్లింల గురించి మన అధిక సంఖ్యాక వారా ్గలకు వుండే సందేహాలు, ద్వేషాభిప్రాయాలన్నీ విచిత్ర రూపాన్ని సంతరించుకుంటాయి. ఉదాహ రణకు పాక్‌లోనో, బంగ్లాదేశ్‌లోనో జరిగే ఘోరా లకు ఇక్కడి ముస్లింలు ప్రశ్నార్హులు అవుతా రు. పైగా జవాబ్దారీ అవుతారు. ఈ దేశంలో ముస్లింల హద్దుల్ని. ఆ దేశాలలోని పౌర హక్కుల దుస్థితితో ముడిపెడతారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు మత పరమైన దేశాలు. మన దేశం అలాంటిది కాదని అలవోకగా మరచిపోతారు. ఈ దేశ ముస్లింలను ఇలాగే వదిలితే ఇవాళ కాకుండా ఓ మనలో అత్యంత గౌరవాస్పద సంస్థలుగా పరడవిల్లుతు న్నాయి. చరిత్రలో మునుపు జరిగిన పొరపాట్లకు మాత్రమే కాదు, ప్రపంచంలో పాక్‌లాంటి దేశాల్లో నడిచే తప్పిదాలకూ, భవిష్యత్తులో ఇలా సంభవిం చవచ్చు అని మనం భయంతో ఊహించుకునే తప్పులకు ముస్లింలు మొత్తంగా బాధ్యులవుతోన్న విషాదకర సన్నివేశమిది. జ్ఞాపకాలు, భయాలు, సంశయాలు, ఊహలు, సమస్త భావాలు ముస్లిం లనగానే ద్వేషం రంగునే పులుముకున్నాయి. ఎలాంటి తప్పిదాలకైనా స్థలకాల పరిమితులుం టాయి. కాని ఈ దేశంలో ముస్లింలుగా పుట్టిన పాపానికి కాలం హద్దులూ లేవు, దేశం గీతలూ వుండవు.

నమ్మదగిన ఎలాంటి గణాంక వివరాలు లేనప్పటికీ, ముస్లింలందరూ నాటుగైదు పెళ్లిళ్లు చేసుకుని కుంటుంబ నియంత్రణకు విరుద్ధంగా పిల్లల్ని కని తమ జనాభాను విపరీతంగా పెంచు కోంటున్నారే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ చరశ్రీనిత్రో ఏ ఒక్క ప్రజా సమూహపు జాతి, ఏ దేశంలో , ఏ కాలంలో, ఇలా ఉద్దేశ్యపూర్వకంగా తమ మతస్థుల జనాభాని పెంచుకున్న దాఖలాల్లే వు. భారత జనాభా గణన వార్తలు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని సమర్థించడం లేదు. ఏ సు దూర భవిష్యత్తులోనో తమ మతస్థులు అత్యధిక సంఖ్యాకులు కావాలన్న ఆశతో ప్రతి ఒక్క ముస్లిం పుషుడ ఆంబోతుల్లా పిల్లల్ని పుట్టిస్తున్నాడన్న ఆలో చనే హాస్యాస్పదమైంది. అలాగే ముస్లిం ఆడవా ళ్లను బుర్ఖాలో దాచేస్తున్న వాళ్లకు విద్య, ఇతర హక్కుల్ని నిరాకరిస్తోన్న మూఢాచారాలు, కుటంబ నియంత్రణ గురించి వాళ్లకుండే అనాసక్తి..ఇవన్నీ ముస్లింల తమ మతస్థుల ప్రత్యేకత చాటుకొ వడానికి సాముహికంగా కావాలని చేస్తోన్న కుట్ర అన ఇవాదిచబడుతోంది. కానీ ఇలాంటివి ..సాం స్కృతిక, సాంఘిక, ఆర్థిక, విద్యా రంగాలన్నింటిలో వెనకబడ్డ జాతి లక్షణాలు. హిందువుల్లోను నిర క్షరాస్యులైన పేద హిందువులే మూఢాచారాల వలల్లో చిక్కుకుపోతున్నారు. వీళ్ల కుటుంఆల్లోనూ ఆడవాళ్లు వంటింటికి ఖైదీలై వున్నారు. వస్త్రాధా రణ విషయంలోనూ హిందువులక్కూడా స్త్రీ శరీర మంతా కామం తాలుకు..తాద్వారా సిగ్గుతో దాచు కోవాల్సిన వస్తువు. హందువుల చీర రవికెల కన్న ముస్లింల బుర్ఖా దేహాన్ని కేవలం ఏడెనిమిది యించులు మాత్రమే ఎక్కువగా కప్పి పెడుతోం దన్న విషయం మనం గయనించాలి. హిందువు ల్లోనూ మగవాళ్లు మాత్రమే కుటుంబ యజమాను లుగా పరిగణింపబడ్డం, మగవాళ్లు యింట్లో వున్న ప్పుడు స్త్రీలు యింటి బయటికి రాకుండా వుండ టం, ఆడవాళ్లు ఒంటరిగా బయటికి వెళ్లలేక పోవడం, మగవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు చీర చెంగుని మఖానికి అడ్డంగా వుంచుకోవడం, పర పురుషుల్ని చూడకుండా వుండిపోవడం, ఆహారం మొదలైన వాటన్నింటిలోనూ భర్తలూ, మగ సంతా నమూ ఎక్కువ భాగం పోందడం మొదలైనవన్నీ ఇప్పటికీ మనకు కనిపిస్తాయి.కుటుంబ నియం త్రణ పట్ల వెనకబడిన నిరక్షరాస్యుల నిరుపేద హిందువులు కూడా అలాంటి లక్షణాలే కల్గిన ముస్లింలలాగే సంకోచ పడుతున్నారు. మన దేశం లో కుటుంబ నియంత్రణకు సామాన్య కుటుంబా ల్లో యిలాంటి వెనుకబడ్డ కుటుంబాలదే పెద్ద సం ఖ్య అని మనం విధిగాగమనించాలి.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…