తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఊదు గాలింది..పీరు లేచింది

తెలుగు ముస్లింల ఆస్తిత్వ కాంక్షకు అక్షర రూపం ‘జల్‌జలా’

చిమ్మ చీకట్లో గణగణమని వినబడే సైకిల్‌ గంట చప్పుడు, ఇరుకు సందులు, గుడ్డి గల్లీలు, గతుకుల రోడ్డు మీదుగా లైట్‌ లేకుండా స్పీడ్‌గా తొక్కుతూ పోయే డొక్కు సైకిల్‌ చెయిన్‌ గరగరల చప్పుడు, కిరాయికి నడిపే ఖటారా ఆటో ఇంజన్‌ కిర్రు చప్పుడు…జల్‌ జలా కవిత్వం కంటికి కనబ డేది కాదు, చెవితో వినేది, చెవికి వినబడేది. ఫక్తు మౌఖిక కవిత్వం. జల్‌జలా కవులు చేశారు. దిగం బర కవిత్వం తాకిడికి అప్పుడు తెలుగు నేల కం పించింది.జల్‌ జలా తాకడికి ఇప్పుడూ కంపిసు ్తన్నది. లేదు కంపించడం లేదు, ప్రకంపనలు మా అనుభవంలోకి రాలేదు, అని ఇంద్రియాలు మంద గించిన మర్యాదస్తులు అప్పుడూ అన్నారు, ఇప్పు డూ అంటున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమి టంటే మర్యాదస్లు కూటమి స్వభావం మారింది అంతే. ‘జల్‌ జలా’ పుస్తకంలో మనకు ప్యాక్‌ చేసి ఇచ్చింది కవితలు కాదు, కేకలు, పోలికేకలు, సైరన్‌ కూతలు, ప్రమాద ఘంటికలు. తెల్లారక మునుపే వినిపించే డబుల్‌ రొట్టె, అల్లంమురబ్బల బాల్యపు పిలుపుల చప్పుడు వున్నచోటికి వచ్చి వేడి వేడి చాయ్‌ ఇచ్చి చలిని వెంటకొనిపోయే బాహర ్‌వాలా ఛోటు  లేలేత మాటల చప్పుడు కూడా మీరు ఇందులో వినవచ్చు.

జాతియత సంతరించుకోని దేశంలో మత ప్రాతిపదికపై హిందుత్వ రాజకీయాలు ప్రజల మీద కృత్రిమంగా జాతీయతాభావాన్ని రుద్దితే భూ కంపం వచ్చి భారతీయ సమాజం కుప్పకూలి పోగలదని హెచ్చరించడానికి, ప్రమాదం పోచిం వుందన్న వార్తను చెవిన వేసి మనలను అప్రమత్తం చేయడానికి ముస్లిం రైటర్స్‌ ఫోరమ్‌ తెచ్చిన పుస్త కం జల్‌ జలా మబ్బుల ఐదుగంటలకు నిద్రపో తున్న వినమడే మసీదు నమాజ్‌ లఫ్జ్‌ చప్పుడు, మొగల్‌పురా, కార్జానా, యూకత్‌పురా బస్తీలలో పేలే పోలీసు తుపాకీ గుండ్ల చప్పుడు కూడా కావా లంటే మీరు ఇప్పుడిక్కడ వినవచ్చు. ఈ దేశంలో పుట్టి పెరిగి కూడా, ద్వీతియ శ్రేణి పౌరులుగా ఏ హక్కులకూ నోచుకోక సమాజం అంచులలో బతు కుతున్న ముస్లింల వేదనామయ జీవితానికి నిలు వుటద్దం ‘జల్‌ జలా’. జల్‌ జలా సంపాదకుడు స్కైబాబ తన ముందుమాట సర్బకఫ్‌లో మాకింకా ఎవరి మీదా భ్రమల్లేవు. అవన్నీ ఐదు సంవత్సరా లప్పటి డిసెంబర్‌ ఆరునాడే కుల్చబడ్డాయ్‌ అన్నాడు.

దళిత సాహిత్యోద్యమానికి కారంచేడు హత్యా కాండ నాంది పలికినట్లే ముస్లిం కవిత్వధారకు బాబ్రి మసీదు కూల్చివేత నాంది పలికింది. అన్నాడు నేషే. ఈ దేశంలో నివసిస్తున్న ముస్లిం లకు ఇక్కడి రాజ్యం మీద, ప్రభుత్వాల మీద లేని పోని భ్రమలు ముందునుంచే లేవు. 1947 జరి గిన దేశ విభజన, స్వాతంత్రానికి పూర్వం నుంచి వారికి వున్న భ్రమలు ఇంకా మిగిలి వుంటే, వాట ిని దాదాపు పోగోట్టింది. మతం పేరిట దేశం ఎప్పుడు రెండు ముక్కలైందో అప్పుడే సంస్కృతికి అం టే భారత జనజీవన సంస్కృతికి విఘతం కలిగింది. సాధారణంగా ఆశ కోల్పోవడం భవిష్య త్తుపట్ల విశ్వాసం నశించడం సకల భ్రమ లు, భ్రాంతులు చెల్లాచెదురు కావడం కాదు. కేవలం నిరాధారమైన అవాస్తవాలు, అబద్ధాలు, వుత్త భ్రమన అని తెలిసిపోవడం మనిషిని దుర్బలుణ్ని చేస్తుంది.

దేశ విభజన చేసిన గాయం పక్కు కట్టిన మానక అనుదినం సలుపుతుండగానే, బాబ్రీ మస ీదు కూల్చివేతతొ ఆ మానని పుండు మళ్లీ పచ్చి దైంది. అయోధ్య పరిణామాలు దేశంలో తమ పరి స్థితి ఏమిటో ఈ దేశపు ముస్లింలకు మరో మారు సృష్టం చేశాయి. బాబ్రీ కూల్చివేత ముస్లిం లోకా నికి ఈ రాజ్యం మీద మిగిలివున్న భ్రమలు పోవ డానికి దొహదం చేసింది. భ్రమ లేకుండా మనిషి జీవించడం దాదాపు అసాద్యం అని భ్రమలు లే కుండా ఎవరైన బతికితే అది చాలా గొప్ప విషయ మని జ్ఞానులు చెప్పడం మనకు తెలిసు. హిందు వులకు భిన్నంగా ముస్లింలు చారిత్రకంగా వివిధ కాలాల్లో భ్రమలు లేని చైతన్యంలో బతికారు. చరి త్రను సరిగ్గా జూడదలిస్తే అందుకు సంబందిం చిన సన్నివేశాలు అక్కడ మనకు కనిపిస్తాయి. మనిషి అంతస్సులో వ్యక్తిగతంగా, చారిత్రకంగా ఎంతటి సంక్షోబం సృష్టిస్తుందో, చూపును నిశితం చేసి ఎలా జ్ఞానం ఇస్తుందొ హెగెల్‌ చెబుతాడు. భావజాలాల మీద భ్రమలు కోల్పోతున్న కాలంలో బతుకుతున్నమనం కొంతకాలంగా ముస్లింలు హెగెల్‌ చెబుతున్న సంక్షోబాన్ని కల్లోలాన్ని , ప్రకం పనలను తమ ఉనికిలో లీనం చేసుకుంటు వస్తు న్నాడు. దేశ విభజన, బాబ్రీ మసీదు కూల్చివేత అంతర్లోకాలలో సృష్టించిన సంక్షోబాలను కూడా వారు సిమిష్టిగా తమలో జీర్ణం చేసుకున్నారు. ఈ క్రమం ముస్లింలను దుర్బలులను, శక్తి హీనులను చేయకుండా, బలవంతులను చేసింది. పరలోక రాజ్యానికి పరిమితమైపోతాయి. క్రైస్తవులు సగం లోనే వదిలిపెట్టిన ఇహాలోక రాజ్య స్థాపన లక్ష్యాన్ని వారి నుంచి స్వీకరించినందువల్లే ముస్లిం లను భ్రాంతి రహిత చైతన్యం కుంగదీయదు. అమెరికన్‌  సామ్రాజ్యావాదాన్ని ఈ రోజున ఒంటి గా ఎదుర్కోంటున్న ఇస్లామిక్‌ చైతన్యం, దాని ఆచ రణ కావడమొక్కటే కాదు విశేషం ప్రతీ అంశాన్ని వున్నదున్నట్లు చూడగలిగే  తత్వం మౌలిక స్వభా వం ఉండటం దాని విశిష్టత. ఇస్లామిక్‌ ఫండ మెంటలిజం అమెరికా ఒక్కదానికే కాదు హిందు త్వశక్తులకు కూడా శత్రువే. మినిషికి మనిషి చైత న్యానికి వాస్తవానికి మధ్య సహజత్వాన్ని సంతరిం చుకొని అడ్డుగొడలుగా వున్న అన్ని భావజాలాలను చేధించుకోని, వాస్తవాన్ని వాస్తవికగా చూడగల నేర్పు శక్తి ముస్లింలకు, వారి జీవితానుభవం ఇ చ్చింది. అందుకే వారికి భ్రాంతిజనిత విశ్వాసాలు, ఉద్వేగాలు ఉండవు. భారతీయ ముస్లింలకు కూ డా అందుకే ఈ దేశపు చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద రాజ్య యంత్రాంగం మీద భ్రమలు వుండవు. స్థానికంగా హిందూ మతతత్వ శక్తులను ఎదుర్కొగలడు. అంతర్లీనంగా అతనికి ఆ శక్తి వుంది. ప్రస్తుతం ఆ శక్తులు నిద్రాణమై వుంటే వుండవచ్చు గాక కాని సమీప భావిశ్యత్తులోనే అవి జాగృతమై తీరుతాయి. ఇల్యూజన్స్‌ పోతే శక్తిహీ నులై పోయి, వీలైనంత తొందరగా కొత్త ఇల్యూ జన్స్‌ సృష్టించుకుని తమనుతాము మభ్యపుచ్చు కునే తత్వం ముస్లింలకు ఒక జాతిగా లేదు, అదే వారి బలం. ఇల్యూజన్స్‌కు తావులేని చైతన్యం వా రి చూపును నిశితం చేసింది వారి జీవన విధా నాన్ని తీర్చిదిద్దింది.

ఉన్న కొద్దిపాటి భ్రమలు కోల్పోయిన శక్తులు సన్నగిల్లని తనం, భ్రమలకు చోటివ్వని మనిషి తనం వెరసి చెదరని గుండె నిబ్బరం జల్‌ జలా కవుల అంతరంగం బహిరంగం వారి మీద కత్తి కట్టినా వెరవక యుద్దావశ్యకత విస్మరించిన వాడే కత్తులకేసి బెదురుగా చూస్తాడు అని ప్రకటించే అంతరంగం వారిని కవిత్వంలో సాయుధం చేసిం ది. ఎవడి చెమట వాడే కక్కుతున్నప్పుడు నీ వంతు రొట్టెలు అడగడం దురాక్రమణ కాదు… నువ్వెం దుకు చూర్లకింద నడుస్తావ్‌ మైదానాన్ని స్వప్నించ నివాడే మస్జీదులో తల దాచుకుంటాడు. శాంతి భద్రతల పేరిట మన రాష్ట్రంలో నక్సలైట్లను పోలీ సులు హతమార్చినట్టే, ఇప్పుడు కొత్తగా ముస్లిం లను ఐఎస్‌ఐ ముద్రవేసి హతమారుస్తున్నారు. ఇక్కడ ముస్లింగా పుట్టిన ప్రతివాడూ దేశద్రోహిగా మారడం ఒక అనివార్య పరిణామమని రాజ్యం భావిస్తున్నది. బాబ్రీ మసీదు కూల్చివేత బొంబాయి అల్లర్ల తరువాత ముస్లింలు ఏకతాటిపై నడిచే పరి స్థితి ఏర్పడటం ఎన్నికలలో, జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా సెక్యులార్‌ పారీ ్టలకు ఓటు వేయడం, దేశ పాలకులకు కంట కంగా మారింది.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…