తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఈ మదర్సాలను నడపడంలో ముల్లాల స్వా ర్థప్రయోజనాలున్నాయి. అవి వారికి జీవనోపాధిని  గుర్తింపును, అధికారాన్ని కల్పిస్తున్నాయి.మదర్సా విద్య ముస్లింలలో ప్రాచుర్యం పోందడానికి మరో కారణం కూడా వుంది. హిందువులలో నేడు మత పాఠశాలలనేవి అసలు లేవనే చెప్పాలి. అత్యధిక ముస్లింలలో ఉన్న వెనుకబడిన సాంస్కృతిక వార సత్వమే దీనికి కారణం. పట్టణ ప్రాంతాలలో ము స్లింలలో అత్యధికులు చేతివృత్తి పనివారు గనుక తమ పిల్లలు కూడా తమ వృత్తినే చేపట్టి కుటుంబ ఆదాయానికి వేడినీళ్లకు చన్నీళ్లలా తోడ్పాడాలని తల్లిదండ్రులు భావిస్తారు. అయినప్పటికీ వారు తమ పిల్లలను మదర్సాలకు పంపుతారు.అది తప్పనిసరి అని వారు భావించడమే దానికి కార ణం.అంతేగాక మున్సిపల్‌ లేదా ప్రభుత్వ పాఠశా లలో పోల్చుకుంటే మదార్సాలు అత్యంత సదుపా యంగా వుండేచోట నెలకోని వుంటాయి. వాటి పనిగంటలు కూడా బాగా ఉదయాన్నే గానీ, రాత్రి పూట గానీ వుంటాయి. అవి వారిపిల్లల ఆర్థిక కా ర్యకలాపాలకు అటంకంగా వుండవు. ఈ మద ర్సాలలో పాఠ్యపుస్తకాలను ఉచితంగా యిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పాఠ్యాంశాలు హిందూ మత ప్రతిపాదికన వుంటాయనే భావన ఉంది. అందువల్ల ముస్లింలు వాటికి దూరమౌతున్నాయి.

ముస్లింలలో లౌకిక విద్యపట్ల గాక మదార్సా విద్య పట్ల ఎక్కువ ఆకర్షణ వుండటం అత్యదికులు వెనుకబడినవారుగా వున్న ముస్లింల ఆర్థిక ప్రగ తికి కచ్చితంగా అడ్డంకిగా వుంది. భారత ప్రభు త్వం ఉదారవాద, మార్కెట్‌ అనుకూల విధానాల ను చేపట్టడంలో ఆధునిక లౌకిక విద్యపట్ల ఆసక్తి చూపినవారికి అత్యధికంగా నష్టం కలుగుతోంది. నేడు అక్షరాస్యత, విద్య లేకుండా ఆర్థిక ప్రగతి అసాద్యం. తమ చేతివృత్తి నైపుణ్యాన్ని చాటుకునేం  దుకు ముస్లింలు అత్యధికంగా సాంకేతిక విద్య నభ్యసించాలి. దీనిని ఎలా సాధించాలి? అది కచ్చి తంగా అసాద్యం. భారతీయ క్రైస్తవులు కూడా వెనుకబడిన కులాలు, తెగలకు చెందినవారే. అయితే ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు ఉభయుల్లో నూ విద్యపట్ల ఎక్కువ శ్రద్ధ చూపడం జరుగుతోం ది.  క్రైస్తవ చర్చిలు సాద్యమైనన్ని పాఠశాలలను ప్రారంభిస్తున్నాయి. అవి దేశంలోనే అత్యు త్తమ మైన పాఠశాలలుగా  బావించబడుతున్నాయి. పాకిస్తాన్‌లో కూడా క్రైస్తవులు నడిపే పాఠశాలలే అత్యుత్తమమైనవిగా వున్నాయి. వాటికి విదేశాల నుంచి సహాయం అందుతున్నదనేది వాస్తవమే. అయితే వివిధ ముస్లిం సంస్థలకు కూడా అనేక అరబ్‌ దేశాల నుంచి సహాయం అందుతోంది. కా ని ముస్లింలు ఈ విధులన్నింటిని మదర్సాలు  నడి పేందుకు వినియోగిస్తున్నారు. ఆధునిక విద్యకో సం పాఠశాలలు లేదా కళాశాలలను వారు చాలా అరుదుగా ప్రారంబిస్తున్నారు. ఆధునిక లౌకిక వి ద్యపట్ల శ్రద్ద వహించినప్పుడు మాత్రమే ముస్లింలు తమ వెనుకబాటుతనం నుంచి బయటపడగలు గుతారు.అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు అవస రమైన విద్యార్హతలు కలిగివున్న ముస్లింలు చాలా స్వల్పసంఖ్యలోనే వున్నారు.వీరు ఆ విద్యార్హతలను సంపాదించేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించాల్సిన ఆవశ్యకత వుంది. ఈ పేద, వెనుక బడిన ముస్లింలను చైతన్య పరిచేందుకు నేడు వారికి ఒక అంబేద్కర్‌ అవసరం. నేడు ముస్లింల కంటే దళితులు అనేక విషయాల్లో ముందున్నారు. వెనుకబడిన ముస్లింలు కూడా తమలోనే అలాంటి అంబేద్కర్‌ను తయారు చేసుకోవలసి ఉంది. అలా  చేసిన అనంతరం కూడా వారు ముందుకు సాగేం దుకు క్లిష్టమైన, సుదీర్ఘమైన పోరాటాన్ని సాగిం చాల్సి వుంటుంది.

-అస్ఘర్‌ అలీ ఇంజనీర్‌

తెలుగోల్ల ముస్లింల సమైక్యతకు నిదర్శనం మొహర్రం

వందల సంవత్సరాల నుండీ భారతదేశంలో ముస్లింలు, ముస్లిమేతరులు సహజీవనం చేస్తు న్నారు. ఇరువురి మధ్య వైరుధ్యాలెన్ని ఉన్నా, తెలు గోల్లు ముస్లింలు పరస్పరం పండుగల్లో, ఉత్సవా ల్లో పాలు పంచుకుంటారు. సమైక్యతాభావా లను పెంపోందించుకుంటారు. ముఖ్యంగా పల్లెల్లోనూ, కొన్ని పట్టణాల్లోనూ తెలుగోల్లు ముస్లింలు మొహ ర్రం పండుగను తమ పండుగగానే భావించి, భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. దర్గాలకు వెళ్లి మొక్కు లు మొక్కుకుంటారు. ఉర్సుల్లో ఉత్సవాల్లో పాల్గోం టారు. ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక, తమిళ ప్రాంతాల్లోని గ్రామీణ ముస్లింలు మశూచికం లాంటి దేవతలకు మొక్కులు మొక్కుకుంటారు. అగ్నిగుండాలు తోక్కుతారు.

ముఖ్యంగా తెలుగోల్లను ఏ ఇతర మతాల్లోని పండుగ ఆకర్షించనివిధంగా మొహర్రం ఆకట్టు కుంది. మొహర్రం పండుగలో అత్యుత్సాహంగా పాల్గోనడమే గాకుండా దాన్ని తమ సంస్కృ తీకరణం చేసి తమనువుగా, అనుగుణంగా మలచుకున్నారు. మొహర్రం పండుగలోని పీర్లను దేవుళ్లుగా భావించి, మొక్కుతారు. తమ గ్రామ దేవతలకు జరిపే వేడుకలను పీర్లకు కూడా జరు పుతారు. ముస్లిం మతంలోని మూల సిద్దాంతా లను పాటిస్తునే తమ ఆచార సంప్రదాయాల కను గుణంగా పీర్ల పండుగను చేసుకుంటారు.

పీర్ల పండుగ తెలుగోల్ల నాకర్షించాడానికి గల కారణాలే ఈ వ్యాసంలో వివరింపబడ్డాయి. మహ మ్మదీయులు భారతదేశంలో ప్రవేశించిన తర్వాత, వారు ముస్లీమేతరులను అణచి వేయడానికి మొద ట ప్రయత్నించడం, తర్వాత మహమ్మదీయులు ముస్లీమేతర రాజులు పరస్పరం సహకరీంచు కోవడం, షియా తెగలవారు, సూఫీ తత్వవేత్తలు మతసామరస్యానికి పాటుపడటం, షిమా మత స్థులైన ముస్లిం రాజులు పీర్ల పండుగను ప్రజల్లో ప్రచారం చేయడం తెలుగోల్లు వీరుల స్మత్యర్థంగా పీర్ల పండుగను జరపడం తమ ఆచార సంప్రదా యాల కనుగుణంగా ఉన్న పీర్ల పండుగలో తెలు గోల్లు పాల్గోనడం, పీర్ల పండుగను తమ సంస్కృతీ కరణం చేసుకున్న విధం, పీర్ల పండుగలోని పాటలను తెలుగోల్లు తమ పౌరాణికాలకు, ఆచా రాలకు అనువుగా మలచుకోన్న విధం లాంటి అం శాలు ఈ వ్యాసంలో చర్చింపబడ్డాయి.ఇస్లాం మ తం క్రీస్తు శకం 7 వ శతాబ్దిలో అరేబియాలో మహామ్మద్‌ ప్రవక్త చేత స్థాపించబడింది. ముస్లిం లు రాకముందు భారతదేశం పైకి గ్రీకులు, శకు లు, హుణులు లాంటి ఎన్నో జాతులు దండెత్తి వచ్చాయి. వీరిలో తిరిగి వెళ్లిపోయిన వారు కొంత మంది, ఇక్కడనే స్థిరనివాసం ఏర్పరచుకున్న వారు మరికొంతమంది. స్వస్థలానికి వెళ్లిపోనివారు భార తజాతిలో విలీనం అయిపోయారు. కానీ భార తదేశం పైకి దండెత్తి వచ్చిన మహమ్మదీయులు మాత్రం భారత జాతిలో కలిసిపోక, తమ మత సంస్కృతీ సంప్రదాయాల ప్రత్యేకతను నిలబెట్టుకు న్నారు.అంతేకాకుండా కొంతమందిని సామ, దాన, దండోపాయాలతో తమ మతంలోకి చేర్చు కున్నారు. మొదట్లో ముస్లిం ప్రభువులు ముస్లీమే తరులను అణచివేయడానికి ప్రయత్నించిన, క్ర మంగా అణచివేత అసాధ్యమని తెలుసుకున్నారు. అందుకే మహమ్మదీయ రాజుల్లో కొందరు ముస్లీ మేతరులకు స్నేహహస్తాన్ని అందించారు. మత సామరస్యాన్ని పాటించారు. ముస్లిమేతరులు కూడా మొదట్లో ముస్లింలతో విభేదించినా తర్వాత పరిపాలనలో ప్రభువుకు సహకరించారు. క్రమం గా ఇరువర్గాల మధ్యన సాన్నిహిత్యం పెరిగింది. ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకున్నారు.

మహమ్మదీయ రాజుల్లో ముఖ్యంగా అక్బరు మత సహనాన్ని చూపెట్టాడు.

భారతీయ సంస్కృతిని గౌరవించాడు. రాజ పుత్రులలో వివాహ సంబందా లను, పాలనా సంబందాలను ఏర్పరచుకున్నాడు. అతను నిర క్షరాస్యుడైన ప్రాచీన సంస్కృతకావ్యా లను, ‘లీలా వతి’ అనే గణిత శాస్త్రాన్ని కూడ పార శీకంలోకి అనువాదం చేయించాడు. మహమ్మ దీయులే కాకుండా ఇతర రాజులు కూడా మత సహనాన్ని ప్రదర్శించారు. దక్షిణ భారతదేశంలో రెండవ దేవ రాయలు ముస్లింల కొరకు మసీదులు కట్టించారు. వారి వీధిలో గోవధ ననుమతిం చాడు. సభలో ఖురాన్‌ని పెట్టించాడు. తెలంగాణా ప్రజలనూ, తెలుగు సాహిత్యాన్ని ఎక్కువగా అభి మానించిన గోల్కోండ పాదుషా కుతుబ్‌సాహిని తెలుగువారు మల్కిభరామునిగా పిలిచి గౌరవిం చారు. ముస్లి మేతర, ముస్లిం మతాల్లోని పండితు లు, వేదాం తులు ఒకరి సాహిత్యాన్ని మరొకరు అధ్యయానం చేసి తమతమ భాషల్లోకి అనువదిం చారు. ముస్లిం పండితులు భారతీయతత్వం, యో గం, వేదాంతం, వైద్యం, జ్యోతిష్యం లాంటి శాస్త్రా లను చదివితే ముస్లిమేతరులు ముస్లింల రసాయ నిక, భౌగోళిక, గణిత శాస్త్రాలను అధ్యయనం చేశా రు.శాస్త్ర సాహిత్య పరంగానే కాకుండా సామ జికంగా కూడా తెలుగోల్ల ముస్లింల మధ్య సాన్ని హిత్యం పెరిగింది. క్రమంగా ముస్లింలు తెలుగోల్ల ఆచారాలను, అనుసరించారు. తెలుగోల్లు మహ మ్మదీయ సంస్కృతీ ప్రభావానికి లోనయ్యరు. సా మాన్యులే కాకుండా మాన్యులైన ప్రభువులు కూడా తెలుగోల్ల పండగల్లో పాల్గోనేవారు. దసరా, రాఖీ పండుగలను ముస్లిం రాజులు తెలుగోల్లతో కలిసి రాజదర్బారుల్లో జరుపుకునేవారు. ఔరంగజేబు కూడ రాఖీ పండుగ ఉత్సవాల్లో స్వయంగా పాల్గోనేవాడు.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది…