తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 6th date

పెళ్ళి కోషిప్‌ వుంటె మా ఇంటీమీద పడ్డది మా పుప్పా,పుప్పు నజర్‌,నా తర్వాత నా బహెన్‌ జేబున్నిసాబేగంను ఇచ్చి షాది చేయమని కొషిప్‌ చేసిన్రు. దాంతోని షాది కుదిరింది. ఏదో మాకు న్నదాంట్లో కొద్దిగిచ్చి షాది చేసిండు మా నయన. గట్ల నాకు సొంతబావైపొయిండు. మేం కొట్లాడు కున్న తిట్టుకున్న పట్టించుకునేటోల్లంగాదు. మాది విడదీయరాని దోస్తానా, హమేషా తమాషాగా వుండేది.
ఇప్పుడు నువ్వు బావవైపోయినవ్‌. మరి నిన్ను పేరుతో పిలవాల్నా లేకపోతె భాయిజాన్‌ అని పిల వాల్నా అనడిగితే ‘నీ యిష్టమే నా యిష్టం’ అని మనసార నవ్వి కౌగిలించుకున్నాడు. సీదాసాద మ నిషి మృదు స్వభావి, హీర. అప్పట్నించి నేను మాత్రం భాయిజాన్‌ అనకుండ ఫయాజ్‌ అని పేరుతోనే పిలిచేవాన్ని తర్వాత ఆర్‌టీసి మెహదీ పట్నం డిపోలో డ్రైవర్‌ నౌకరి దొరికింది. నేను హైద్రాబాద్‌ పోయినప్పుడల్లా డ్రైవింగ్‌ చేసేటప్పు డు ఆయన పక్కనే నిలబడి మొత్తం పట్నం చూసే ది. ప్రేమమూర్తి అందరిని దుష్మని లేకుండా ఆద రించేవాడు, ఆహ్వనించేవాడు ఇంటికి. ఉన్నదాం ట్లోనే ఖుషీగా సంసార నౌకను లాగేవాడు.
వర్సగా పిల్లలు పుట్టటం, కష్టాలు పెర్గటం షూరు ఐంది. నల్గురు బేటీలు, నల్గురు బేటాలు. తల్లి, తండ్రులకు ఆస్రాగుండాలని నార్కట్‌పల్లి డిపోకి తబాదిల చేయించుకుండు.అబ్బా, అమ్మీలకు ఖిద్మ త్‌ చేయటంలో కూడ ఏమి తక్కువ చేయలేదు. వాళ్ళు జన్నత్‌కి వెళ్ళిపోయిన్రూ. కష్టాల సముద్రం లో జిందగీ నౌకను నడపలేక బేజారైండు. జీతం అవసరాలు తీర్యేదికాదు. దోస్తుల,రిప్తేదార్ల సహ యంతో కువైత్‌ అనే దినార్ల తోటలో అడుగు పెట్టిండు. మేమెంతో ఖుషీ ఐపోయినం. హాయి గా, దర్జాగా బతుకోచ్చని.1990 ఆఖర్లో కువైత్‌లో అడుగు పెట్టి కెటిసిలో డ్రైవర్‌గా చేరిండు. దలిం దర్‌ గయా దర్బార్‌, కచేరి హొగయి బర్‌ఖాస్‌ అన్నట్లు 1991 మొదట్లో యుద్దం మొదలైంది. ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ కువైత్‌పై దురా క్రమణ చేయటం, కువైత్‌ రాజు అమెరికా సహ యం అర్థించడం జరిగింది.
వెంటనే అమెరికా ఇరాక్‌మీద యుద్దం ప్రకటించ డం ఐపోయింది. ఇరాక్‌మీద అమెరికా దాడులు ప్రారంభం. కువైత్‌మీద, అమెరికా ఇజ్రాయిల్‌మీ ద ఇరాక్‌మీద అమెరికా దాడులు ప్రారంభం. కు వైత్‌ మీద, అమెరికా ఇజ్రాయిల్‌ మీద ఇరాక్‌ భీక ర పోరాటం జర్గుతుంది. ఒక నెల నౌకరి చేసిండో లేదో ఫయ్యాజ్‌ హడలెత్తిపోయిండు. పాణాన్ని ము ఠ్ఠిలో పట్టుకోని, అష్టకష్టాలు అనుభ వించి ఆఖ రికి ఇంటికి చేరుకుండు. నెల జీతం దొరకలేదు. చేతి లో చిల్లిగవ్వలేదు. ఎటుచూసినా పరేషాని ఆవ హించింది. యుద్దం ఏకధాటిగా షుమారు నెలరోజులు సాగింది.
మళ్ళి ఆర్‌టీసి నౌకరిలో చేరిపోయిండు. ఐదారు నెల్లు గడిచిపోయినాయి. కువైత్‌, ఇరాక్‌ దురాక్ర మణ నుండి బైటపడ్డది. స్వేచ్చా స్వతంత్రాలు తిర్గి పుచ్చుకుంది అమెరికా అండతో. అమెరికా కను సన్నల్లో బందీఐంది. పిల్లలు పెద్దగైతున్రూ. జీతం పెర్గుత లేదు. ఎట్లైతేఏంది, కువైట్‌ కెటిసి నుండి మళ్లి పిలుపువచ్చింది. మీరు మళ్లి వచ్చి మీ, మీ డ్యూటీలలో భర్తీ కావాలని
మళ్లి కువైత్‌ వెళ్లి మళ్లి కెటిసీలో చేరిపోయిండు. కష్టాలు దూరమైనాయి. నెలకు డెబ్బైఐదు దినార్లు జీతం. అందులో నుండి పది, పదిహేను దినార్లు కోతపోను, అరవై దినార్లు చేతికందేవి.మన ఇండి యాలెక్క ప్రకారం షుమారుగా పదివేలు జీతం. ప్రతినెల ఇంటికి ఆ పదివేల కట్టలు పం పించే వాడు. మరి ఆయన అక్కడ ఏం తినేదో ,ఎట్లా తినేదో ఆ పైవాడికే తెలియాలి. ‘బాహెర్‌ గంయ్‌’ అనంగనే ఇంట్లో వాళ్ళకు జర శానతనం పెరుగు తుంది. సహజంగా ఎవరికైన. ఆ బైటిగాలి ఇంటి కి తగిలింది.రిశ్తెదార్ల తాకిడి పెరిగింది, రావ టం పోవటం ఆ ఇంట్లో కూసొని రోజుల తరబడి తిన టం మరిగిన్రూ. ఫయాజ్‌ అక్కడ ఎంత కష్టప డుతుండు అన్న సంగతి ఎవలికి గుర్తురాకపోయే ది. కూసోని తింటే గుట్టయిన ఆగదు. గుట్ట నుం చి రోజు ఒక రాయి తీస్తూవుంటే జంగలే జంగ ల్‌.పిల్లలకు ఇంగ్లీషు మీడియం, పెద్దబళ్లు, పెద్ద సదువులు. పీజులు, స్కూలు డ్రెస్సులు వగైరా ఖర్చులతో ఇల్లు గుల్ల ఐపోతుంది. తీసీన గంధం బుడ్డకే సరిపోతుంది ఇక జామా సంగతి ఎక్కడా!
ఏడ్వకు మాము ఏడ్వకు బాన్‌జా సుజాత్‌ నన్ను ఊపి పలకరిస్తుండు. ఏం చేస్తాం మన చేత్ల ఏం వుంది. అంతా అల్లా యిష్టం. ఆయన కిస్మత్ల అట్ల రాసి ఉంది. సుజాత్‌కి ఇంక చిన్నతనం పోలే. అబ్బాజాన్‌ సచ్చిపోయ్ని వాడికి హోస్‌ లేదు. ఏమాత్రం ఘమ్‌గానిప,పరేషానిగాని అసలు లేదు ఇరవై రెండేళ్లు వచ్చినా ఇంకా తెల్వి ముదర లేదు. ఇంకా బచ్‌పన్‌ శకలే. పదవతరగతి ఫేల్‌ ఐండు. ఇంగ్లిపీసు సదువు అబ్బలేదు వాడ్కి మూ డేండ్లు ముందల అబ్బాజాన్‌ ఇంటికి వచ్చిండు. అట్ల చేయకు, ఇట్లా చేయకు, రౌడి సొబత్‌ తిర్గకు. మంచిగా సద్వుకో.నువ్వె ఇంట్కి బడా బేటవు కద రా. ఇంట్ల వారందరికి అదపు చెయ్యి, డ్రైవర్‌ విద్య నుర్చుకో లైసేన్స్‌ తీసుకో. పాస్‌పోర్టు తీసు కో. నేను అక్కడ్కిపోయి నీకోసం వీసా తీస్కోని నా దగ్గర్కి పిలిపించుకుంట అని ఎన్నో తీర్ల సంజా యించిండు. అఛ్చా అఛ్చా అని గొర్రెలెక్క తల ఊపడమేగాని ఏం సమజ్‌దార్‌ కాలె.
అవునూ…సర్దార్‌ అలీ ఖాన్‌దాన్‌ల అందర్కి హార్‌ ్టఎటాక్‌ షైతాన్‌ పట్టుకుందేంది? మొన్న మూడు, నాలుగేండ్ల కింద మంజ్లా బేటకు హార్ట్‌ఎటాక్‌ వ చ్చి సచ్చిపాయ్‌. ఆయనకి ఆబ్కారీలో సర్కారి నౌ కరి ఉండబట్టే ఆ యింటికి సర్కారు ఆస్ర ఐంది ఆయనకు రావలసిన సర్కారు సోమ్ము బాగానే వచ్చినయ్‌. ఆయన పెద్దబేట షమీమ్‌కి ఆదే శాఖ లో సర్కార్‌ నౌకరు ఇచ్చిన్రు. సర్కారు నౌకరి చేస్తు సస్తేనే కదా పిల్లలకు సర్కారు నౌకరు ఇస్తుంది ఈ సర్కారు. ఎట్లాయితేంది షమీమ్‌కి నౌకరి వచ్చింది ఆ కుటుంబం హాయిగా గాలి పీల్యుకుంది. కష్టాల భూతం ఇంట్లోకి రాలేకపోయింది. వచ్చిన పైస ల్తోని ఇద్దరు బేటిల షాదీలు చేసిన్రు. సంతోషం గానే బతుకు బండి నడుస్తుంది. ఫయాజ్‌ సాల హఫీజ్‌ చెప్పుకుంటూ పోతుండు.
సర్దార్‌ అలీ పుప్పా నాలుగో కొడుకు హఫీజ్‌ సౌది అరేబియా పోయిండు. రెండు మూడేండ్లు అక్కడ ట్రక్‌ డ్రైవర్‌ నౌకరి చేస్తు కొద్దోగొప్పో సంపాయిం చుకొనితిరిగి ఇండియాకి వచ్చిండు. షాది చేస్కోని సంసార్‌ బాగానే చేసిండు. రహీమా గర్బవతిగా ఉన్నప్పుడు మళ్లీ సౌది అరేబియా పోయిండు. ఇక్కడి వాళ్లకు తిండికి సరిపోను పంపేవాడు. గట్ల నే రావటం పోవటం జరిగింది. ఆ మధ్యల నల్గు రు అమ్మాయిలు, ఒక్కగానొక్క కొడుకు పుట్టిన్రు. వారిని అల్లారుముద్దుగనే చూసుకుండు. మళ్లీ ఇండియాకు వచ్చిండు. ఒక లక్ష రూపాయలు తెచ్చినా నని చెప్పిండు. ఒక సంవత్సరం ఖాలీ గానే కూసో ని తిని తిర్గిండు జల్సాగా. ఉన్న పైస లన్ని ఐపోయి నాయి. మళ్లీ బత్కు పరేషాని చుట్టే సుకుంది.మళ్లీ సౌది అరేబియా పోయే కోషిష్‌ల లక్షరూపాయలు అప్పు జేషిండు. అజాద్‌ వీసా తీస్కోని సౌది అరేబి యాలో చివరిసారిగా కాలు మొపిండు. పదినెల్లదా క ఏ పని దొర్కలేదు. ఇంట్కి పైసల్‌ పంపలేకపో యిండు. దాంతో పిల్ల లంతా ఉపాసం. ఆఖరికి ఒక షేక్‌ దగ్గర పర్మినెంట్‌ నౌకరి అగ్రిమెంటు చేస్కుండు. జీతం బాగానే కుదిరింది. ఐతె పరేషా న్‌కి బాత్‌ ఎందం టే, సరిగ్గా రెండు నెల్లు ఉద్యోగం చేయలేకపో యిండు. అచానక్‌ హార్ట్‌ఎటాక్‌ వచ్చింది. దుని యానుంచి రొఖ్‌సత్‌ తీసుకుండు, కష్టాల కడలి నుంచి చాలదూరంగా వెళ్లిపోయిండు. ఆఖరి దీదార్‌ కాని ఆఖిరిమాటకు గూడ నోచుకోలేదు రిశ్తేదార్లు, భార్య పిల్లలు. ఆ ఇంటిలో మొత్తం అం ధేరా నిండిపోయింది. దరిద్రం చుట్టుకుంది. ఇక్క డివాళ్లకు అదే కదా మరి అందని ద్రాక్షపండు పుల్లగుంటది. ఆర్నెల్లు గడవకముందే గీ ఫయాజ్‌ ఆలీ బాయిజాన్‌ మరణవార్త పిడుగులెక్క మీదప డే. ఏం చెయాల్నో తెల్వక అందరూ హైరన, పరే షాన్‌ పడ్డరు. అందరూ యిప్పుడు ఆయన్ని తల్చు కోని రోన షూరు జేసిన్రూ. ఘర్‌కీ ముర్గి దాల్‌ బరాబర్‌. ఇంట్లొ ఉన్నంతవరకు మనిషి విలువ తెల్వదు. పనికిరాని కోడి పేగుల్లెక్క తీసిపారేస్తారు. మనిషి గతించిపోయినంక గాని వాని అవసరం, బరువు బాద్యతలు అన్నీ ఒక్కోక్కటి యాదిల వస్తుంటాయి. దూరపు కొండలు నునుపుంటాయ ని తల్చుకోని దినార్లు సంపాయించాలనే ఆశతోని ఉర్కిపోతిని. దీపం ఉండంగా ఇల్లు సక్కబెట్టుకోవా లని నా చెల్లె జేబున్నీసాబేగంకు తెల్వంది కాదుగ ని, షానతనంలో మునిగింది.తన పెనుమిటి బైటి దేశాలకు పోయిండు ఇంకా నాకేం తక్కువని ము రిసిపోతిని. ఇప్పుడేంది నీ సక్కదనం ఏం సమజ ్‌దారి పని జేసినావ్‌. ఇంట్కి దీపం ఇల్లాలు అంట రుగని, చేజేతుల నీ ఇంట్లో ఆంధేర నింపుకుం టివి.
మా భాయిజాన్‌ బతికున్న రోజుల్లో అప్పుడప్పుడు మా చెల్లి ఇంట్కిపోయోది. వంశానికి పెద్దన్నయ్య లెక్క నీకు పిల్లలకు మంచి చెడులు జర భయం చెప్పేది. గీ బైట్కిపోయేటోల్లు ఎంద్కుపోతారోగాని ఇల్లు ఖరాబ్‌, పిల్లలు ఖరాబ్‌ అబ్బాజాన్‌ డర్‌ ఉండదు. తరీఖ ఉండదు.
అమ్మ…బహెన్‌ నువ్వు నలుగురు ఆడపిల్లలు గల్ల దాన్వి నీకోచ్చే పైసల్లో కాసిన్ని దాస్కో ఎవరికి తెల్వకుండా అంటే నన్ను నా మాటల్ని తీసిపా రేస్తివి.
నీకేం తెల్సు పిల్లల సద్వులకు, వచ్చిపోయే వాళ్ల ఖర్చులకు వచ్చిన పైసల్‌ సరిపోతలేవ్‌ అని కఠి నంగా ఎక్కిరిస్తివి. అవునమ్మా నీ ఇంట్కి ఎవ రొచ్చిన, తిష్ట వేసి కూసోని మింగుతున్రూ చెప్పు! అంతా మీ ఆయన తరుపు వాల్లే కదా! ఐనా చెల్లె లి సోమ్ము తినేంత దుష్టబుద్దీ కాదు నాది. నాకు తెల్వదా నీకు ఆడపిల్లలున్నారని నీకు మంచి చెప్పి తే, నా నెత్తిమీద బద్నామ్‌ తట్ట పెడ్తివి.అప్న దిల్‌ దు ఖాకె బోల్తా పరాయ హసాకె బోల్త. నిజం నిప్పు లాంటిది. అది కసరుగా, పచ్చి చేదుగా వుంటది. వేపచిగురులెక్క వున్నా, దాన్ని మింగి నెమరేసు కొనె ఇంగిత జ్ఞానం లేకపోయింది నీకు. అది నీ కిస్మత్‌.
బావ కువైట్‌కు పోయి తేరా సాల్‌ ఐపాయ్‌గదా తీ న్‌ తేర నౌ అఠ్ఠార ఐపాయే. లోకులకు చెప్తే పెదా లమీద వేలేసుకుంటున్రూ. పదమూడేండ్లు కువై ట్‌ల ఉన్న ఏం జమా జేసి పెట్టలేదా అనేది లక్ష దీనార్ల ప్రశ్న?? ప్రతినెలా వచ్చే పదివేలు తింటిరి. సండాస్‌ నింపి పెడ్తిరి. ముందొచ్చె కష్టాల గురిం చి గాని, ఆడపిల్లల షాది మేజ్వాని,లేన్‌దాన్‌ గురిం చి జరంత ఫికరుగూడ జెయ్యవైతి. నువ్వు జరంత యిక్మత్తు చేసి నెలకు ఒక రెండు వేలు దాచిపె ట్కోని ఒక చిన్న చిట్టి ఏస్కోంటే ఎంత బాగుండేది. ఈ పదమూడేండ్లలో మూడు. నాల్గు లక్షలన్న నీ పేరుమీద బ్యాంకుల జమ ఉండేది. ఆయన పో యిన గింత ముష్కిల్‌ ఉండేది కాదు. నల్గురమ్మా యిలు పెద్దగై కూసున్రూ నీ గుండెల మీద. ఈ రోజులు మున్గిపోను! ఒక బిడ్డ షాది చేయాలంటే లక్షలు కావాలంటున్రూ లేన్‌దెన్‌ గిట్ల. పేరు పెద్ద రికం…అన్నట్లు నీ దెగ్గెరేమో ఏం లేకపాయె మీ ఆయన బైట్కి కువైత్ల వుంటడని బడానామ్‌ శాన్‌ వుంది. ఒక్క బిడ్డకు షాది చేయాలంటే షాది ఖర్చు లకు కనీసం రెండు లక్షలన్నా కావాల్నాయ్‌. ఆ లెక్కపోంటి జూస్తే నల్గురికి ఎనిమిది లక్షలు హోనా. ఏం చేద్దాం మరి? మేడి చెట్టంత మనిషి కూలిపాయే ఇంక నాకు దిక్కెవరన్న దిగులు, నీ జీవితాంతం నిన్ను చెదలు లెక్క నీ భేజా తింటూనే వుంటదమ్మా.ఆ రంది నాక్కొరకే గాదు అందర్కి వుంటది. నాకు ఏ బాధ, రంది లేదనుకుంటున్నా వా? నీ తర్వాత, అందరికంటే ఎక్కువగా నాకే పరేషాని పట్టుకుంది. నేను నా భాయిజాన్‌ ఒక్క ఈడొల్లం. వల్‌పటా దాపటా లెక్క తిర్గినోల్లం. మేము ముందుగాల జిగ్రి దోస్తులం. ఖానా పీనా లో సగం పంచుకున్నవాళ్లం. నాకు ఆ తర్వాతనే భాయిజాన్‌ ఐండు. భాయిజాన్‌ ంటే నాకు దోస్తానా ప్రేమబంధమే ఎక్కువ. నా బావ 20.8. 2003 నాడు సచ్చినప్పటినుండి మూడు రోజులు, మేరా దిల్‌ రోహతహైతో పూరా ఆస్మాన్‌ రోతహై అన్నట్లు నా రోనాతో పాటె రోనా కలిపింది. జుమ్మ రోజు మట్టిలో కలిపేంతవరకు మున్సిపల్‌ గా ఏకధాటిగా నా కన్నీళ్లతో ధారాపాతమై కురి సింది. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కని గుండె నిబ్బరం జేస్కోవల్సిందే!?
-వేముల ఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది….