తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 8th

హిందువులు ఈ దేశస్థులు కారు ముస్లిం సాహిత్యానికి ఇంతవరకు ఎవరూ ఫిలాసఫిని త యారు చేసుకోలేదు. ఆ ప్రయత్నం జరిగితే బా గుంటుంది. హిందువులమని చెప్తున్నవాళ్లు ఈ దేశస్థులు కారు. వాళ్లు జర్మన్లు. ముస్లింలే అసలు భారతీయులు. ఇండియాలో ముందు హిందూ మ తం లేదన్న విషయం ఎవరూ మాట్లాడడం లేదు. ఇట్లాంటి విషయాలన్నింటిపై చర్చ జరిగితే ఎవరు అసలు భారతీరయులో తెలుస్తుంది.
415 అంశాలు అంబేడ్కర్‌ ప్రతిపాదించినప్పటికి అవన్నీ తీసిపారేసి ఇప్పుడున్న దాన్ని రాజ్యాంగం అన్నారు. అవన్నీ తీసివేసినంక ఈ రాజ్యాంగం కింది తరగతుల వారికి పనికిరాదని అప్పుడే అంబేద్కర్‌ అని ఉన్నాడు. ఉదాహారణకు ఎస్సీలు హిందూ మతంలో ఉంటే ఆ కేటగిరిలో కొన సాగుతారు. క్రైస్తవ మతంలోకి మారితే బీసీ’సీ’ అవుతారు. (అదే ముస్లింలోకి మారితే??) అంటే మనసులో యేసుక్రీస్తు ఉన్నా బైటి ప్రపంచానికి రామున్ని నమ్ముతున్నట్టుంటేనే ఎస్సీ కేటగిరిలో కొనసాగుతారన్నమాట. ఇదీ పరిస్థితి.
గుజరాత్‌లోనే కాదు అన్ని చోట్ల ఊచకోత జరుగు తోంది. ముస్లింలు ఈ దేశంవాళ్లు కారనే నేచర్‌ని ఇన్నాళ్లు పెంచిపోషించారు. దాన్ని బ్రేక్‌ చేస్తూ ముస్లింలే అసలు భారతీయులని ఎప్పుడైతే చెప్పగ లుగుతామో అప్పుడే హిందువులు ఈ దేశంలో లేకుండా పోతారు.
ముస్లింల కోసం పాకిస్తాన్‌, కువైట్‌, సౌదీ లాంటి దేశాల నుండి ఫండ్స్‌ రావాలి. కానీ, వాళ్లేమో ఇక్కడివాళ్లను ముస్లింలనే భావించడం లేదు. దాన్ని బట్టి ఈ దేశపు ముస్లింలు ఎవరో అర్థమవు తుంది.
-మద్దూరి నగేష్‌బాబు
నాలుగు ప్రశ్నలు ఒక జవాబు
గుజరాత్‌లో ముస్లింల ఊచకోత ఎందుకు జరిగింది అనే మూడో ప్రశ్నకు ‘ఊచకోత గుజ రాత్‌లో ఎందుకు జరిగింది’ అనే ప్రశ్నగా నేను అర్థం చేసుకుంటున్నాను. ప్రశ్నను అలా తీసుకు న్నట్లయితే ప్రత్యేకించి గుజరాత్‌ స్థానిక పరిస్థితు లను తెలుసుకోవాలి. ఆ పరిస్థితుల్ని అధ్యయనం చేయని నాబోటి వారికి అది కుదరదు. నేను గుజ రాత్‌ ఘోరాన్ని దేశంలోని సాధారణ పరిస్థితికి వొ క తీవ్ర వుదాహరణగా తీసుకుంటున్నాను.
ప్రత్యేకం ఉన్న ఆ ప్రశ్నను.. ఆ మేరకు.. పక్కన పెడితే, నాలుగు ప్రశ్నలకు ఒకే యూనిట్‌గా తీసు కున్న మాట్లాడవచ్చు. ప్రశ్నల మధ్య అలాంటి సం బంధం ఉంది. ఇప్పుడు నేను ఆ విధంగానే మా ట్లాడుతున్నాను.
ఈ ప్రశ్నల్లో స్త్రీవాదం అనే మాట వుంది. దళిత వాదం అనే మాట వుంది. ముస్లిమ్‌ వాదమనే మాటలేదు. అది సహజమే.స్త్రీ దళితవాదాలలో ‘వాదం’…అంటే ‘ఆలోచనల-చట్రం’ వుంది.ఇన్నా ళ్లూ పురుషుల దృక్కోణంలోంచి ప్రపంచాన్ని చూ శారు ఇన్నాళ్ల ఆలోచనలకు కేంద్రం పురుషుడు. దీన్ని డీసెంటర్‌ చేసి…కేంద్రాన్ని మార్చి… యిప్పు డు స్త్రీల దృక్కోణంలోంచి ప్రపంచాన్ని చూస్తాం అన్నారు స్త్రీవాదులు. ఆ పని చేసేసరికి యిప్పటివ రకు సత్యాలనుకున్న పలు అంశాలు అసత్యాలు గా,అసత్యాలనుకున్నవి సత్యాలుగా కనిపించడం మొదలెట్టియి.
ఇన్నాళ్లూ అగ్రవర్ణుల దృక్కోణంలోంచి ప్రపం చాన్ని చూశారు. ఇన్నాళ్ల ఆలోచనలకు ‘కేంద్రం’ అగ్రవర్ణులే. దీన్ని డీసెంటర్‌ చేసి..కేంద్రాన్ని మా ర్చి..యిప్పుడు దళితుల దృక్కోణంలోంచి చూస్తాం అన్నారు దళితవాదులు. ఆ పని చేసేసరికి యిన్నా ళ్లు న్యాయం అనుకున్న పలు అంశాలు అన్యాయా లుగా, అన్యాయం అనుకున్నవి న్యాయాలుగా కని పించడం మొదలెట్టాయి.
అందువల్ల,యీ రెండింటినీ ‘వాదాలు’ అనడం సహజం, సమంజసమయ్యింది. రచయితలు కొత్త సత్యాలు, కొత్త న్యాయల వేదిక ఎక్కి మాట్లాడగలి గారు. కనీసం ఆలోచనల మేరకయినా..పాత చట్రాల్ని కొత్త చట్రాలు వొడించగలిగాయి. తమ ంటూ స్పష్టమయిన స్థానాన్ని ప్రతిష్ఠను సంపా దించగలిగాయి. సమాజంలో, సాహిత్యంలో ‘స మ్మతి’ ని సాధించగలిగాయి.
ముస్లిమ్‌వాదం అనే మాటను మనం యిప్పటికి ప్పుడు టంకించినా అది ప్రాచుర్యం సంపాదించు కుంటుందని ఆశించలేం. ముస్లిమ్‌వాదం అంటూ వొక ఆలోచనల చట్రాన్ని నిర్మించడం చాల కష్టం స్త్రీ, దళితవాదులు స్పష్టమైన ఆలోచనల చట్రాన్ని నిర్మించారు. ‘ముస్లిమ్‌వాదులం’టూ ఎవరేనా వు న్నట్లయితే వారినుంచి ఇటువంటి కృషి యిప్పటివ రకు జరగలేదు. జరగడానికి వున్న అవకాశం కూ డా తక్కువే.
ఇన్నాళ్లూ ప్రపంచాన్ని హిందూ దృక్కోణంలోంచి చూశారనే మాట నిజమే. మ్లేచ్చులు, అప్రాచ్యులు, కిరస్తానీల వంటి తూష్టీకారాలకూ ఆ దృక్కొణమే పునాది. రాజ్యాలు స్థాపించి, విస్తరించి, అధికారం చలాయించడం మినహా వేరే ఆశయాలు లేని కౌటిల్యుడిని, రాణా ప్రతాపుడిని, శివాజీని ‘దేశభ క్తులు’గా పునరావిష్కరించడం హిందూ దృక్కో ణంలో రాసిన చరిత్రే
అది నిజమేగాని, దీన్ని డీసెంటర్‌ చేసి యిప్పుడు ముస్లిమ్‌ దృక్కోణంతో ప్రపంచాన్ని చూడాలనడం కుదరదు. ‘హిందూత్వ’ మాదిరిగానే ముస్లిమ్‌ వాదం కూడా మతవాదమే అవుతుంది. మతం దృక్కోణంలోంచి ప్రపంచాన్ని చూడడమే అవు తుంది. దీన్ని డీసెంటర్‌ చేయలనుకుంటే, లౌకికవాద దృక్కోణంలోంచి ప్రపంచాన్ని చూడా ల్సి వుంటుంది.
అలాంటి ప్రయత్నం జరుగుతోంది. ఆ మేరకు హిందూత్వవాదుల్ని ఎదుర్కోనడమూ జరుగుతోం ది.ఆ మేరకు హిందూవాదుల నుంచి ముస్లిముల మీద జరిగే భౌతిక, సాంస్కృతిక దాడులను ఎది రించడమూ జరుగుతోంది. చరిత్ర రచనలో బ్రిట ిష్‌-పూర్వ యుగాన్ని హిందువులపై ముస్లిముల దాడిగా చిత్రించే చాదస్తుల వాదాల్ని పకడ్బందీగా నిరసించి, వొడించిన ప్రగతిశీల చరిత్రకారులకు కొదవలేదు. ఇటీవలి కాలంలో బాబ్రీ మసీదు విధ్వంసాన్ని, గుజరాత్‌లో ముస్లిం ప్రజలపై హ త్యాకాండను నిరసించిన వారిలో అత్యధికులు పు ట్టుక వల్ల హిందువులే.”చైతన్యవంతులనుకునే వాళ్లలోనూ హిందుత్వం వుంటోంది” అనే స్టేట్‌ మెంట్‌ వాస్తవాన్ని ప్రతిబింబించదు. ”ముస్లిం వ్య తిరేకతను పోగొట్టేందుకు ఏ సంస్థలుగాని వ్యక్తు లుగాని లేరు” అనే స్టేట్‌మెంట్‌ కూడా ఆ మేరకు సత్యదూరమే. హేతువాదులు, మానవవాదుల నుంచి అతివాద కమ్యూనిస్టుల వరకు పలు సంస్థ లు, వాటిలోని వ్యక్తులు ముస్లిం వ్యతిరేకతను నిర సించారు.
ఆ మాటకొస్తే దేశంలోని పౌర సమాజం స్త్రీవాదం పక్షాన, దళితవాదం పక్షాన నిలిచినంత కన్నా ఎ క్కువగా ముస్లిం వ్యతిరేకతకు వ్యతిరేకంగా నిలి చింది. ఈ పనిలో పౌర సమాజం లోని వామ ప క్షం మిగిలిన అందరి కన్న ముందు వరుసలో నిల బడింది. నుక యీ ప్రశ్నల్లో యిమిడి వున్న స్టేట్‌ మెంట్లను జనరల్‌గా పౌర సమాజానికి వర్తింప జేయడం కష్టం.
అయితే, ముస్లిం సాహిత్యానికి..స్త్రీ, దళిత వాదాల కు దొరికినంత సమ్మతి దొరకలేదన్నది ఆలోచిం చాల్సిన విషయమే. ఇక్కడ మనం జనరల్‌గా పౌర సమాజం గురించికాకుండా ‘తెలుగు సాహిత్యం ‘ అనే వౌక సామాజిక -భాగం గురించి మాట్లాడు కుంటునానం.స్త్రీలలొ ,దళితులలో కొందరు ఎగు వ వర్గాల వారు వుండొచ్చు కాని , స్త్రీలలొ దళితు లలో అత్యధికులు పీడితులు.వారిలో ఎగువ వర్గా నికి ఎగబాకిన వారిని కూడా పలు విదానాలుగు పీడన, అగౌరవ వెన్నాడుతుంటాయి,అందువల్ల స్రీ ్తవాద , దళిత వాద సాహిత్యాలు మమ్మొదట ‘ ఫిర్యాదు- సాహిత్యాలు ‘ . స్త్రీలు , దళితులు తమ అస్తిత్వాన్ని బహిరంగంగా ప్రకటించుకుని, అస్తి త్వాన్ని ద్రువీకరించుకొడం అనేది వొకరంగా యి న్నాళ్ల దురన్యాయానికి ధిక్కారం అంటే యీ ధిక్కా రం కూడా ఫిర్యాదులొంచి మొలిచిన మొక్కే
నాకు అర్థమయినంతవరకు కన్నీళ్లు పునాది కలి గిన యుద్ద ప్రకటన,విషాదం పునాది కలిగిన విప్ల వం సాహిత్యానికి అనువయిన వస్తువులు అది … కేవలం ఆ కన్నీళ్ల వెనుకనున్న కళ్లకు ,ఆ విషాదం వెనుకున్న మనిషికే కాకుండా యితర్లకు కూడా అప్పీలింగ్‌గా వుంటుంది కన్నీర్లు ,విషాదాల పునా ది తగినంతగా లేని యుద్ద నినాదనికి మారుపల కాలని ఆ అస్తిత్వాలకు చెందిన వారికి కూడా అనిపించదు.స్త్రీవాద ,దళిత వాదాలలొని ‘వాదా లు’
కాస్త వికటించినా .వోక ట్రెండు సాహిత్య రచన లు అదే త్రొవా తొక్కినా… ఆ ధోరణులలో వచ్చిన సాహిత్యం స్త్రీలూ
దళితులనే గాక యితర్లకు కూడా భావొద్వేగాల కు గురి చేసింది ఆ మేరకు ‘సమ్మతి ‘ని సంపాదిం చింది .
స్త్రీవాద సాహిత్యం వుత్పత్తిలో ,పునరుత్పత్తిలో తరతరాలుగా పేరుకున్న స్త్రీల ఫిర్యాధును వ్యక్తం చేసింది. అదే సమయంలో స్త్రీల విశిష్టతను ధ్రువీ కరించింది.దళితవాద సాహత్యం వుత్పత్తిలో , సా మాజిక సంభందాలలో దళితుల ఫిర్యాదును నమోదు చేసింది.దళితవాద విశిష్ట కాంట్రిబూ ష్య న్‌నీ ద్రువీకరించింది. ఈ రెండింటిలో చర్రిత వుంది, వర్తమానం వుంది . ఫిర్యాదు , అజెర్షన్‌ . .. కేవలం యివాల్టిని కాదు పరిణామాలు దానికి కారణమనుకొవడానికి వీలుండేది. చారిత్రకం కాబట్టి ఆ కన్నీరూ విషాదాన్ని సామాజిక వుత్పత్తు లుగా చూస్తున్నాం. సమాజమే దాన్ని సరిచేయా లని డిమాండ్లు చేస్తున్నాం.
ముస్లిమ్‌ అస్తిత్వంలో కన్నీరు ,విషాదం లేవా? ఉన్నాము.కాని,సమస్త ముస్లిములకు ప్రాతినిథ్యం వహించాలని ప్రయత్నంచే ‘ముస్లిం- సాహిత్యం ‘ ఆ అప్పిల్‌ని వుపయెగించుకోలేదు.హిందువులలొ అగ్రవర్ణులున్నట్లే ,ముస్లిములలొనూ ‘అగ్రవర్ణులు ‘న్నారు. హిందు అగ్రవర్ణులు అనుభవిస్తున్న తర హా సౌకర్యాల్ని (ప్రివిలేజెస్‌) ‘ ముస్లిం -అగ్ర వర్ణులూ ‘ అనుభవిసున్నారు. ‘ముస్లిమ్‌ – బ్రహ్మ ణ వాదా’న్ని
ధిక్కరించకుండా కేవలం ‘హిందు బ్రహ్మణ వాదా’ న్నే విమర్శించినంత కాలం…. ముస్లిం సాహిత్యం పూర్తి ‘సమ్మతిని’ సాధించలేదు.
మరోక మాటలలో చెప్పాలంటే వట్టి ముస్లిమ్‌ సాహిత్యం కాదు.దళిత సాహిత్యామే కన్నీరు, విషా దాల
పునాదిపై నిర్మించిన సాహితీ సౌదం అవుతుం ది,ఖాదర్‌ ‘పుట్టుమచ్చు’లో ,అంతకంటే ఎక్కువగా ఖాజా వంటి కవుల రచనల్లొ పేద ,దళిత ముస్లి ముల నొప్పి వుంది.ఖాజా , షాజాహన్‌ వంటివా రు ముస్లిమ్‌ స్త్రీల బాదాస్వరాన్ని అద్బుతంగా పలి కారు.’పలికారు. ‘జల్‌జలా’ , ‘జిహాద్‌’ సంపుటా లలో ‘ముస్లిం- బ్రహ్మణ వాదాన్ని ‘ ధిక్కరించే కవితలు కొన్ని వున్నాయి.ఏది ఏమయినా యిలాం టివి చాలా తక్కువ .అందులోనూ విమర్శ లక్ష్యం అసృష్టం .హిందూత్వాన్ని ముస్లిములపట్ల హిందూ వివక్షను తూర్పారబడుతూ ,అప్పుడప్పుడు ముస్లి మ్‌ కర్మకాండలను వుగ్గడిస్తూ వెలువడిన సాహి త్యామే చాలా ఎక్కువ . ‘పుట్టుమచ్చ ‘లొ ముస్లిమ్‌ పక్షాన హిందుత్వవాదులపై చేసిన ‘బహిర్‌-యు ద్దరావ ‘ చాల బాగుంది. ముస్లిమ్‌ అగ్రవర్ణులపై ,వారి ఛాందసత్వంపై చేయాల్సిన ‘అంతర్‌ – యు ద్దారావ మెప్పుడు ?’ అని అడిగాను ఖాదర్‌ని. మొదట వాస్తవికమైన ఫిర్యాదు ,దాని వెన్నింటి అజెర్షన్‌ వచ్చినప్పుడే అంధం.మాల , మాదిగ కు లస్థుల ముమ్మొదట దళితులు ఆ తరువాతే మాల మాదిగ కులస్థుల లేకపోతే,యిది వఠ్ఠి ‘కులవాద’ మే అవుతుంది.పింజరి, దూదేకుల,మరికొన్ని ‘కు లా’లకు చెందిన వారు ముమ్మొదట దళీతులు లేక పీడితులు.ఆ తరువాతే ముస్లిములు ద్వారా ‘దళిత ముస్లిమ్‌’ సాహిత్యం పౌర సమాజంలో మనసున్న వారందరి నుంచి ‘సమ్మతి’ సంపాదించగలుగు తుంది.
సన్నకారు రైతుల బాదల్ని ఏకరువు పెట్టి పెద్ద భూస్వాముల లాభం పొందినట్లుగా ,రువు పేరు, చెప్పి కాంటాక్టర్లు కార్లలో వూరేగినట్లుగా దళిత ముస్లిముల నెప్పిని సొమ్ము చేసుకుని ముస్లిం కోటీ శ్వరులు ,గురువరేణ్యలుతమ భోగ విలాసాన్ని స మర్థించుకొవచ్చు. రచయితలూ కవూలూ యిక్క డా అప్రమత్తులయి వుండి జనం ముందు తమకు తాము సృష్టం చేసుకోవాలి. అస్తిత్వవాద -రాజకీ యాల్ని , సాహత్యా రూపాల్ని మరింత లొతుగా అధ్యయనం చేద్దాం .సమాజ గమానాన్ని నిర్దే శంచే వర్గ -వైరుధ్యాల్నించి మన ఆలోచనలు వై దొలగితే ; డప్పుల మోతకు చెదిరి వేటగాని నిలి బడిన జంతువులమయిపోతాం. -హెచ్చార్కె
-వేముల ఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది…