తెలంగాణ కవాతు ఆపే ప్రసక్తే లేదు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఐకాసనేతలు మీడియాతో మాట్లాడారు. కవాతును శాంతియుతంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ మంత్రుల వైఫల్యం వల్లే కవాతు చేయాల్సి వస్తోందని, మాతో ఉంటారో లేదో తెలంగాణ మంత్రులు తేల్చుకోవాలి అని కోదండరాం అన్నారు. తెలంగాణ కావాతుకు ‘సాగరహారం’ పేరును ఖరారుచేసినట్లు వివరించారు. కవాతులో కళప్రదర్శనలు కూడా ఉంటాయని చెప్పారు. టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, స్వామిగౌడ్‌, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.