తెలంగాణ గోడు వినరు.. గొంతు తడపరు

సీమాంధ్రకు కృష్ణా జలాలు..ఇది కాదా ! వివక్ష
ఆర్డీఎస్‌ తూములు పగులగొట్టినోళ్లు .. పోతిరెడ్డిపాడు నీళ్లెత్తికెళ్లినోల్లతో

హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి):
కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ , ప్రొఫెసర్‌ కోదండరాం ఖండించారు. శనివారం ఆయన మీడయాతో మాట్లాడుతూ తెలంగాణ గోడు వినే నాథుడే లేడని, ముందుగా తెలంగాణ ప్రజల గొంతు తడిపిన తరువాతే సీమాంధ్ర ప్రజలకు నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆర్డీఎస్‌ తూములు పగుల కొట్టి నీటిని తీసుకుపోయినోళ్లు, పోతిరెడ్డిపాడుకు నీళ్లెత్తుకెళ్లినోళ్లతో తెలంగాణ ప్రజలు కలిసి ఉండడం ఎలా సాధ్యమన్నారు.రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ నాటకాలాడుతోందని విమర్శించారు. తెలంగాణ గొంతెండుకు పోతుంటే సాగర్‌ జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. సాగర్‌లో నీటి పరిమాణం డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నప్పటికీ భవిష్యత్తు తెలంగాణ ప్రజల తాగునీటి ఆవసరాలను దృష్టిలో ఉంచుకోకుండా తమ ప్రాంతానికి నీటిని తరలించుపోతోంద న్నారు.నీటి పంపిణీ విషయంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని ఖండించారు. తెలంగాణకు దేవుడే దిక్కు అన్న సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యలతో ప్రభుత్వం ఉన్నదీ దేనికని ప్రశ్నించారు. విలీనానికి ముందు ఉన్న తెలంగాణ కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఈ ప్రాంత ప్రజలు అంగీకరించబోరని అన్నారు. యన డిమాండ్‌ చేశారు. ఈ పది జిల్లాలలో ఏ ఒక్కటి తగ్గినా, పెరిగినా సహించేది లేదని కోదండరాం హెచ్చరించారు. ఈ సందర్భంగా కోదండరావమ్‌, టీఎన్‌జీవో నేతలతో కలిసి హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు రాయలతెలంగాణ వద్దంటూ వినతి పత్రము సమర్చించినారు.